15న విచారణకు రాలేను..మహిళా కమిషన్ కు బండి సంజయ్ లేఖ

15న విచారణకు రాలేను..మహిళా కమిషన్ కు బండి సంజయ్ లేఖ

మహిళా కమిషన్ నోటీసులపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ స్పందించారు.  మార్చి 15న తాను విచారణకు హాజరుకాలేనని మహిళాకమిషన్ కు బండి సంజయ్  లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున మార్చి 15 కు బదులుగా మార్చి 18న కమిషన్ చెప్పిన టైంకే హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు.  అలాగే  తాను ఎందుకు హాజరుకావాలో మహిళా కమిషన్ వివరాలివ్వాలని కోరారు. వివరాలిస్తే  తాను  వివరణ ఇచ్చేందుకు సులభం అవుతుందని  కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై  వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్  బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసింది. మార్చి 15న కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.