బెంగుళూరు బచ్ గయా: కోల్‌ కతాపై గెలిచిన కోహ్లీ సేన

బెంగుళూరు బచ్ గయా: కోల్‌ కతాపై గెలిచిన కోహ్లీ సేన
  • కోల్ కతాపై ఛాలెంజర్స్ ఉత్కంఠ గెలుపు
  • కోహ్లీ మెరుపు సెంచరీ, సత్తా చాటిన అలీ
  • ఆర్ సీ బీ ని వణికించిన రాణా,రసెల్

ఈడెన్‌ దద్దరిల్లింది. మెరుపుల్లాంటి ఫోర్లతో.. పిడుగుల్లాంటి సిక్సర్లతో.. సునామీని తలపించే పరుగుల వర్షంతో తడిసి ముద్దయింది.నలుగురు బ్యాట్స్‌ మెన్‌ ఒకరిని మించి ఒకరు అన్నట్టు వీర విధ్వంసం సృష్టించిన వేళ ఫ్యాన్స్‌ పరవశించిపోయారు. ముందుగా విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ మెరుపు సెంచరీ, మొయిన్‌ అలీ అద్భుత అర్ధ శతకంతో చెలరేగి బెంగళూరుకు భారీ స్కోరు అందించారు. పది ఓవర్లకు ఆర్‌ సీబీ70/2తో నిలిస్తే.. చివరి ఐదు ఓవర్లలోనే 91 రన్స్‌ తో జట్టు స్కోరు 200 దాటించారు. కోల్‌ కతా టార్గెట్‌‌‌‌‌‌‌‌ 214 రన్స్‌ . 33 పరుగులకే మూడువికెట్లు పడ్డాయి. 12 ఓవర్లకు స్కోరు 81/4 మాత్రమే. 48 బంతుల్లో 133 పరుగులు కావాలి. ఇలాంటి టైమ్‌ లో బెంగళూరు విజయం నల్లేరుమీద నడకే అనిపించింది. కానీ, నైట్‌‌‌‌‌‌‌‌రైడర్స్‌ ఆ జట్టును వణికించింది. యువ క్రికెటర్‌ నితీశ్‌ రాణా, కరీబియన్‌ డేంజర్‌ మ్యాన్‌ ఆండ్రీ రసెల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి కోల్‌ కతాను గెలిపిం చినంత పని చేశారు. పోటీపడి సిక్సర్లు కొడుతూ కోహ్లీ సేనకు కంగారు పుట్టించారు.చివరి ఓవర్లో రైడర్స్‌ కు 24 రన్స్‌ అవసరం అవగా.. పార్ట్‌‌‌‌‌‌‌‌టైమర్‌ మొయిన్‌ అలీ 13 పరుగులే ఇవ్వడంతో బెంగళూరు ఊపిరి పీల్చుకుంది.

కోల్‌ కతా: హమ్మయ్యా .. బెంగళూరు గెలిచింది. రసెల్‌ , రాణా కలిసి దడ పుట్టించిన వేళ ఈడెన్‌ ‌‌‌గార్డెన్స్‌ లో కోహ్లీసేనకి అదృష్టం అండగా నిలిచింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌ లో పది పరుగుల తేడాతో గెలిచి ఊపిరిపీల్చుకుం ది. విరాట్‌ కోహ్లీ(58 బంతుల్లో 9 ఫోర్లు, 4సిక్సర్లతో 100) మెరుపు సెంచరీకి మొయిన్‌‌‌‌ అలీ( 28 బంతుల్లో 5ఫోర్లు, 6 సిక్సర్లతో 66) ధనాధన్‌‌‌‌ హాఫ్‌ సెంచరీ తోడవడంతో టాస్‌‌‌‌ ఓడి ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం నైట్‌ రైడర్స్‌ 20 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసి ఓడిపోయింది. నితీశ్​ రాణా (46బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 85 నాటౌట్‌ ), ఆండ్రీరసెల్‌ (25 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 65)పోరాటం వృథా అయింది.

రాణా, రసెల్‌ ఊచకోత..

భారీ ఛేజింగ్‌ లో కోల్‌ కతాకు శుభారంభం దక్కలేదు. పవర్‌ ప్లే ముగిసే లోపే టాపార్డర్‌ అంతా డగౌట్‌ చేరిం ది. క్రిస్‌‌‌‌ లిన్‌‌‌‌(1), సునీల్‌ నరైన్‌‌‌‌(18), గిల్‌ (9)ఊతప్ప(9) ఇలా వచ్చి అలా వెళ్లడంతో 11.5 ఓవ-ర్లకు 79/4తో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.కానీ, అప్పటికే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న రాణా.. రసెల్‌ తో కలిసి బెంగళూరు బౌలింగ్​ను ఊచకోత కోసేశాడు. సైనీ వేసిన 16వ ఓవర్లో 4, 6 కొట్టి 33 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రాణా ఆ వెంటనే మరో సిక్స్‌ కొట్టాడు.స్టెయిన్‌‌‌‌ వేసిన 18వ ఓవర్లో రెం డు సిక్స్‌ లు, ఓ ఫోర్‌ కొట్టా డు. మరోవైపు రసెల్‌ ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్‌ కొట్టాడు. సైనీ వేసిన 14వ ఓవర్లో క్లాసెన్‌‌‌‌ క్యాచ్‌ వదిలేయడంతో వచ్చిన లైఫ్‌ ను రసెల్‌ సద్వినియోగం చేసుకున్నా డు. చహల్‌ వేసిన 15వ ఓవర్లో హ్యాట్రిక్‌‌‌‌ సిక్స్‌లు కొట్టా డు. సిరాజ్‌ వేసిన 17వ ఓవర్‌ లో 4, 6కొట్టా డు. స్టొయినిస్‌‌‌‌ వేసిన 19వ ఓవర్‌ లో హ్యాట్రిక్‌‌‌‌ సిక్స్‌ లు కొట్టిన రసెల్‌ ఆఖరి ఆరు బంతులకు జట్టు లక్ష్యాన్ని 24 రన్స్‌ చేశాడు. అయితే మొయిన్ అలీవేసిన లాస్ట్‌‌‌‌ ఓవర్లో 13 పరుగులే రావడంతో కోల్​కతాకు ఓటమి తప్పలేదు.

మొయిన్‌ ధనాధన్‌

పవర్‌ ప్లేలో బెంగళూరు బ్యాటింగ్‌ చూసిన వారెవ్వరూ ఆ జట్టు భారీ స్కోరు చేస్తుందని ఊహించి ఉండరు.కోల్‌ కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు 42 రన్స్‌ మాత్రమే చేసింది. నరైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌ లో భారీ షాట్‌ కు ప్రయత్నిం చిన పార్థివ్‌ పటేల్‌ (11) డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ లో రాణాకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే అక్ష-దీప్‌ నాథ్‌ (13)ను రసెల్‌ ఔట్‌ చేశాడు. కోహ్లీ క్రీజులోఉన్నా ఆశించిన వేగం లేకపోవడంతో పది ఓవర్లకు ఆర్‌ సీ బీ 70/2తో నిలిచిన ఆర్‌ సీ బీ స్కో రు 160దాటితే గొప్పే అనిపించింది. ఇలాంటి సమయంలోమొయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ రాకతో బెంగళూరు ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయిం ది. ఎదుర్కొన్న రెండో బంతికి సిక్సర్‌ కొట్టిన మొయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ.. చావ్లా వేసిన 12వ ఓవర్లో మరో సిక్సర్‌ కొట్టాడు. కుల్దీప్‌ వేసిన 14వ ఓవర్‌తొలి బంతిని స్టాండ్స్‌ లోకి పంపి జట్టు స్కోరు వంద దాటించా డు. బౌండ్రీలే లక్ష్యంగా ఆడిన అతను 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.కుల్దీప్‌ వేసిన 16వ ఓవర్లో తన విశ్వరూపమే చూపించా డు. ఆ ఓవర్లో మూడు సిక్సర్లు ,రెండు ఫోర్లు కొట్టి న మొత్తం 27 రన్స్‌ రాబట్టా డు. దాంతో, రెప్పపాటు లో స్కోరు 150 దాటింది. అయితే, అదే ఓవర్‌ చివరిబాల్‌ కు అలీ ఔటయ్యాడు.

విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీరంగం..

మొయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ మెరుపు బ్యాటింగ్‌ కే ఈడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దద్దరిల్లింది. అతను ఉన్నంతసేపు ఎక్కడబంతి వేయాలో తెలియక బౌలర్లు తలపట్టుకున్నారు. అలీ ఔటయ్యాకే కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఆ వెంటనే విరాట్‌ ఉగ్రరూపం దాలుస్తాడని వాళ్లు ఊహించలేకపోయారు. మొదటి 50 పరుగులకు 40 బంతులు తీసుకున్న కోహ్లీ.. ఇంకో 18బంతుల్లోనే యాభై పరుగులు చేసి నైట్‌ రైడర్స్‌బౌలర్లకు పీడకల మిగిల్చా డు. అలీ క్రీజులోఉన్నంతవరకూ అతనికి స్ట్ర యిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చేలా చేస్తూ శాంతంగా బ్యాటింగ్‌ చేశాడు. తొలి బౌం డ్రీకి పది బంతులు తీసుకున్న విరాట్‌హాఫ్‌ సెంచరీ మార్కు దాటే వరకు చాలా నెమ్మదిగా ఆడాడు. కుల్దీప్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి … రసెల్‌వేసిన 11వ ఓవర్‌ లో భారీ సిక్సర్‌ రాబట్టాడు.

ప్రసిధ్‌ వేసిన ఇన్నింగ్ స్‌ 15వ ఓవర్‌ తొలిబంతికి సిం గిల్‌ తీసి హాఫ్‌ సెం చరీ పూర్తిచేశాడు. కానీ, అలీ ఔటైన తర్వాత అతనుఒక్క సా రిగా గేరు మార్చేశాడు. క్లాసిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాట్లతో వరుస పెట్టి బౌండ్రీలు కొట్టాడు.లెఫ్టా మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్‌ గర్నీ వేసిన 17వ ఓవర్లో 4, 4,6తో రెచ్చిపోయిన అతను.. నరైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌లోడీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా మెరుపు వేగంతో సిక్సర్‌ బాదాడు. ప్రసిధ్‌ వేసిన 19వ ఓవర్లో లాంగాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా సిక్సర్‌ .. ఇన్నింగ్స్‌ కే హైలైట్‌ అనిపించే రీతిలో అద్భుతమైన కవర్‌ డ్రైవ్‌ తో ఫోర్‌ కొట్టి 90 లోకివచ్చా డు. అయితే, గర్నీ వేసిన ఆఖరి ఓవర్‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంతికి కోహ్లీ సింగిల్‌ తీయగా,తర్వాతి రెండు బాల్స్‌ కు మార్కస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  స్టొయినిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (8 బంతుల్లో 17 నాటౌట్‌ ) 4,6 బాదాడు. నాలుగో బాల్‌ కు సిం గిల్‌తీసి కో హ్లీ కి స్ట్ర యిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చా డు. ఐదో బంతికిఫోర్‌ కొట్టి సెం చరీ మార్కు దాటిన విరాట్‌ఆఖరి బాల్‌ కు శుభ్‌ మన్ కు క్యా చ్‌ ఇచ్చా డు.

స్కోరుబోర్డు

బెంగళూరు: పార్ధి వ్‌ (సి) రాణా (బి) నరైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 11, కోహ్లీ (సి) గిల్‌ (బి) గర్నీ 100,అక్షదీప్‌ (సి) ఊతప్ప (బి) రసెల్‌ 13, అలీ (సి) ప్రసిధ్‌ (బి) కుల్దీప్‌ 66, స్టొ యినిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (నాటౌట్‌ ) 17; ఎక్స్‌ ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 213/4;

వికెట్ల పతనం:1–18, 2–59, 3–149, 4–213; బౌలింగ్‌ : గర్నీ 4–0–42–1, నరైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4–0–32–1, ప్రసిధ్‌ 4–0–52–0, రసెల్‌ 3–0–17–1, కుల్దీప్‌ 4–0–59–1, చావ్లా 1–0–10–0.

కోల్‌ కతా: లిన్‌‌‌‌‌‌‌‌(సి) కోహ్లీ (బి) స్టెయిన్‌‌‌‌‌‌‌‌ 1, నరైన్‌‌‌‌‌‌‌‌ (సి) పార్థి వ్‌ (బి) సైనీ 18, గిల్‌ (సి) కోహ్లీ (బి) స్టెయిన్‌‌‌‌‌‌‌‌ 9, ఊతప్ప (సి) నేగి (బి) స్టొయినిస్‌‌‌‌‌‌‌‌ 9, రాణా (నాటౌట్) 85, రసెల్‌ (రనౌట్‌ )65, కార్తీక్‌‌‌‌‌‌‌‌ (నాటౌట్‌ )0; ఎక్స్‌ ట్రాలు 16, మొత్తం: 20 ఓవర్లలో 203/5;

వికెట్ల పతనం : 1–6, 2–24, 3–33, 4–79, 5–197. బౌలింగ్‌ : స్టెయిన్‌‌‌‌‌‌‌‌ 4–0–40–2, సైనీ 4–0–31–1, సిరాజ్‌ 4– 0– 38-–0, స్టొయినిస్‌‌‌‌‌‌‌‌ 4–031–1 ,చహల్‌ 3–0–45–0, మొయిన్ 1–0–13–0.