బంగ్లాదేశ్– పాకిస్తాన్ : సెకండ్ టెస్ట్.. ఓటమి దిశగా పాక్.. నాలుగో రోజు .. సెకండ్ ఇన్నింగ్స్ పాకిస్తాన్ 316/7
సిల్హెట్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాకిస్తాన్ ఓటమి దిశగా సాగుతోంది. 437 రన్స్ లక్ష్య ఛేదనలో భాగంగా మంగళవారం నాలుగో రోజు ఆట కొనసాగించిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 316/7 స్కోరు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (75 బ్యాటింగ్, సాజిద్ ఖాన్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
డే స్టార్టింగ్ నుంచే బంగ్లా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. దాంతో ఓపెనర్లు అజాన్ అవైస్ (21), అబ్దుల్లా ఫజల్ (6) త్వరగా ఔటయ్యారు. షాన్ మసూద్, బాబర్ ఆజమ్ మూడో వికెట్‌కు 92 రన్స్ జత చేశారు. తర్వాత సల్మాన్ ఆగా (71), రిజ్వాన్ ఆరో వికెట్‌కు 134 రన్స్ జత చేసి ఇన్నింగ్స్‌ను మళ్లీ గాడిలో పెట్టారు. తైజుల్ ఇస్లామ్ 4 వికెట్లు తీశాడు.
