న్యూఢిల్లీ: తమ పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఎపిసోడ్ నేపథ్యంలో ఇండియాలో టీ20 వరల్డ్ కప్ ఆడబోమని హెచ్చరించిన బంగ్లాదేశ్ క్రికెటర్లకు స్పాన్సర్‌షిప్ భయం పట్టుకుంది. కెప్టెన్ లిటన్ దాస్, యాసిర్ అలీ, మోమినల్ హక్‌లాంటి టాప్ ప్లేయర్లకు ఇండియాకు చెందిన ఎస్‌జీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించొద్దని ఎస్‌జీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. మరోవైపు ఇండియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో ఆడే విషయంలో ప్రజా భావోద్వేగాలకు లోనుకాకుండా నిర్ణయం తీసుకోవాలని మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్.. తమ దేశ క్రికెట్ బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం పదేళ్ల తర్వాత తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందన్నాడు. అయితే తమీమ్ చేసిన ఈ వ్యాఖ్యలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ విమర్శించారు. తమీమ్‌ను ‘భారతీయ ఏజెంట్’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.
