
- రెండో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విక్టరీ
మీర్పూర్: టీ20 ఫార్మాట్‌లో బంగ్లాదేశ్ అదరగొడుతోంది. ఇటీవలే శ్రీలంకలో తొలిసారి సిరీస్ నెగ్గి రికార్డుకెక్కిన బంగ్లా టీమ్.. ఇప్పుడు తమ సొంతగడ్డపై పాకిస్తాన్ జట్టు పని పట్టింది. పాక్‌పై మొదటిసారి టీ20 సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది. మంగళవారం జరిగిన రెండో టీ20లో బంగ్లా 8 రన్స్ తేడాతో గెలిచింది. దాంతో మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ పోరులో తొలుత బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 133 రన్స్‌కు ఆలౌటైంది. జాకర్ అలీ (48 బాల్స్‌లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 55), మెహిదీ హసన్ (33) రాణించారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా, అహ్మద్ డానియల్, అబ్బాస్ ఆఫ్రిది తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌లో పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 125 రన్స్‌కే ఆలౌటైంది.
షోరిఫుల్ ఇస్లాం (3/17), మెహిదీ హసన్ (2/25), తంజిమ్ హసన్ (2/23) టాప్, మిడిలార్డర్ కుదేలవడంతో ఓ దశలో పాక్ 15/5తో నిలిచింది. ఫఖర్ జమాన్ (8), సైమ్ ఆయుబ్ (1), మహ్మద్ హారిస్ (0), కెప్టెన్ సల్మాన్ అఘా (9), హసన్ నవాజ్ (0), మహ్మద్ నవాజ్ (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ దశలో ఫహీమ్ అష్రఫ్ (51) ఫిఫ్టీకి తోడు చివర్లో అబ్బాస్ ఆఫ్రిది (17), డానియల్ (17) పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. జాకర్ అలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య గురువారం చివరి, మూడో టీ20 జరుగుతుంది.