
2025 ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా గురువారం ( అక్టోబర్ 2 ) జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ చిత్తు చిత్తుగా ఓడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 38. 3ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు బంగ్లా బౌలర్లు. 130 పరుగుల చేజింగ్ కోసం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 31.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు సాధించి 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది బంగ్లాదేశ్.
పాక్ బ్యాటర్లు రమీన్ షమీమ్ (23), ఫాతిమా సనా (22), మునీబా అలీ (17), డయానా బేగ్ (16), సిద్రా నవాజ్(15) అలియా రియాజ్ (13) పేలవమైన ప్రదర్శనతో బంగ్లా బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. బంగ్లా బౌలర్లు షోర్నా అక్తర్ 3 వికెట్లు, నహిదా అక్తర్, మరూఫా అక్తర్, చెరో రెండు వికెట్లు పడగొట్టి పాక్ ను స్వల్ప స్కోర్ కే కట్టడి చేశారు.
130 పరుగుల ఛేజింగ్ కోసం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోయి తడబడినప్పటికీ... రబియా హైదర్ హాఫ్ సెంచరీతో రాణించడంతో విజయం సాధించింది.
సంక్షిప్త స్కోర్లు
- పాకిస్థాన్ - 129-10 (38.3 )
- బంగ్లాదేశ్- 131-3 (31.3 )