జమ్మూలో ఉగ్రవాదుల దుశ్చర్య

జమ్మూలో ఉగ్రవాదుల దుశ్చర్య

జమ్మూలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అమాయకులపై కాల్పులకు తెగబడుతున్నారు. గత కొన్ని రోజులుగా స్థానికేతరులపై ఉగ్రమూకలు దాడులకు తెగబడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే ఓ కశ్మీర్ పండిట్ టీచర్ పై ముష్కరులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. తీవ్రగాయాలైన అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై నిరసనలు పెల్లుబికాయి. ఈ ఘటన మరిచిపోకముందే జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు మరో దారుణానికి పాల్పడ్డారు. కుల్గామ్ జిల్లా మోహన్ పొరాలో బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్‌‌పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన విజయ్ కుమార్ ను హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజస్థాన్ కు చెందిన విజయ్ కుమార్ మోహన్ పొరాలోని ఇలాఖీ దేహతీ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఆయన్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో నిక్షిప్తమయ్యాయి. కాల్పుల సమాచారం తెలుసుకున్న భద్రతాబలగాలు.. అక్కడ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంకు పరిసర ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. కుల్గామ్ ఓ పాఠశాల బయట జమ్మూకి చెందిన రజనీ బాలా అనే హిందూ ఉపాధ్యాయురాలిని ఉగ్రవాదులు చంపిన రెండు రోజులకే ఈ దాడి జరిగింది. మరోవైపు కాల్పుల ఘటనను ఖండించారు రాజస్థాన్ సీఎం గహ్లోత్. కశ్మీర్ లో శాంతి స్థాపించడంతో బీజేపీ ప్రభుత్వం  విఫలమైందన్నారు గహ్లోత్. కశ్మీర్ పౌరుల భద్రతను కేంద్రం బాధ్యతని ట్వీట్ చేశారు గహ్లోత్. ఇటీవలే జమ్ముకశ్మీర్ లో టీవీ నటి, టీచర్ ను కాల్చి చంపిన ఉగ్రవాదులు.. ఇప్పుడు బ్యాంకు మేనేజర్ పై దాడి చేయడంతో.. స్థానికులు ఆందోళనలు చేపట్టారు.

 

మరిన్ని వార్తల కోసం : -

మోడీని కలిసిన నిఖత్ జరీన్, మనీశా మౌన్, పర్వీన్ హుడా

సోనియా గాంధీకి కరోనా