ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం..

ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం..

హైదరాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. మహిళల వేషధారణలో అపార్టు మెంట్లోకి వచ్చి ఫ్లాట్ తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెక్కాలనీ ఆకృతి ఆక్రేడ్లోలోని ఫ్లాట్ నెంబర్ 502 ప్రైవేటు ఉద్యోగి కే. వెంకటేశ్వర్రావు ఉంటున్నారు. అదే అపార్టు మెంట్లోని 406 ఫ్లాట్లో ఆయన కూతురు, అల్లుడు కూడా నివసిస్తున్నారు. వెంకటేశ్వర్రావు 16వ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి ఒంగోలు వెళ్లారు.

18వ తేదీ శనివారం ఉదయం ఇంటికి పని మనిషి 502 ఫ్లాట్ కు రగా ఇంటి తాళం పగుల గొట్టి ఉండటాన్ని గమనించి. ఇంట్లోకి వెళ్లి చూడగా సామగ్రి అంతా చిందరవందరగా కనిపించడంతో వెంకటేశ్వర్రావు కూతురుకు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

సీసీ కెమెరాలను పరిశీలించగా 18వ తేదీ తెల్లవారు జామున మహిళల వేషధారణలో ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు అపార్టుమెంట్లోకి చొరబడి 502 ఫ్లాట్ తాళం పగులగొట్టి ఇంట్లోని అల్మారాలో దాచిన 4 తులాల బంగారు ఆభరణాలు, లక్ష నగదు, ఓ ల్యాప్టాప్ దొంగలించినట్టు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.