బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ పోస్టులు..అర్హతలు ఇవే..

బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ పోస్టులు..అర్హతలు ఇవే..

బ్యాంక్ ఆఫ్​ బరోడా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న  రిటైల్ మేనేజర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 26.

పోస్టుల సంఖ్య: 417.

పోస్టులు:  మేనేజర్(సేల్స్) 227, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ 142, అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్ 48.

ఎలిజిబిలిటీ

మేనేజర్ (సేల్స్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. మూడేండ్ల పని అనుభవం ఉండాలి. బ్యాంకింగ్, సేల్స్, మార్కెటింగ్ లో ఎంబీఏ/ పీజీడీఎం పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. 

అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్,  అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్: అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డెయిరీ సైన్స్, ఫిషరీ సైన్స్, పిసికల్చర్, అగ్రి మార్కెటింగ్ అండ్ కో–ఆపరేషన్, కో–ఆపరేషన్ అండ్ బ్యాంకింగ్, ఆగ్రో ఫారెస్ట్రీ, ఫారెస్ట్రీ, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ఫుడ్​సైన్స్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్​మెంట్, ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీలో నాలుగేండ్ల డిగ్రీ లేదా ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్​కు ఏడాది,  అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్ కు మూడేండ్ల అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 24 ఏండ్లు, గరిష్ట వయోపరిమితి 42 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 06 

లాస్ట్ డేట్: ఆగస్టు 26. 

అప్లికేషన్ ఫీజు: జనరల్‌‌, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్/ డీఈఎస్ఎం, మహిళా అభ్యర్థులకు రూ.175.

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/  ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
ఆన్ లైన్ టెస్ట్ 

 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి. 150  ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-–1లో  రీజనింగ్ ఎబిలిటీ 25 ప్రశ్నలు 25 మార్కులకు, సెక్షన్-–2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, సెక్షన్–3లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, సెక్షన్–4లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ 75 ప్రశ్నలు 150 మార్కులకు మొత్తం 225 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 150 నిమషాల్లో ఎగ్జామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు.  
పూర్తి వివరాలకు bankofbaroda.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.