జల్సాలకు అలవాటు పడిన బావాబామ్మర్దులు బ్యాంకుకు కన్నం వేసి.. చివరకి పోలీసులకు చిక్కిన ఘటన హైదరాబాద్ రాచకొండ పీఎస్ పరిధిలో జరిగింది. రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించి వీరు పాల్పడ్డ చోరీల గురించి తెలిపారు.
2016 లో ఘట్కేసర్ పరిధిలోని ఆంద్రా బ్యాంక్ లో వీరిద్దరు గ్యాస్ కట్టర్ల సహాయంతో 4 కిలోల బంగారు ఆభరణాల చోరీ చేశారు. ఆ తర్వాత ఈ నెల 7 బిబీ నగర్ లోని ఎస్బీఐ బ్యాంక్ లో చోరీకి పాల్పడడంతో ఎస్ఓటి పోలీసులకు చిక్కారు . వారిద్దరిని పెరిక ఎబ్బి, అతని బావమరిది కత్తుల శివకుమార్ గా పోలీసులు గుర్తించారు. నిందితుల నుండి అరకిలో బంగారు ఆభరణాలు, రెండు కార్లు, ఒక ఆక్టీవా స్కూటి, మూడు సెల్ ఫోనుల రికవరీ చేశారు. వీటి విలువ మొత్తంగా రూ. 25,55,000 ఉంటాయని పోలీసులు చెప్పారు.
