Technology : బ్యాంక్‌‌ల కోసం ఏజెంటిక్‌‌ ఏఐ.. రిలేషన్‌‌షిప్ మేనేజర్లకు వరం

Technology : బ్యాంక్‌‌ల కోసం ఏజెంటిక్‌‌ ఏఐ.. రిలేషన్‌‌షిప్ మేనేజర్లకు వరం

బ్యాంకింగ్‌‌ రంగంలో ఏజెంటిక్‌‌ ఏఐ కీలకమైన మార్పులు తీసుకువస్తోందని ఈ మధ్య వచ్చిన మెకిన్సీ నివేదిక ద్వారా వెల్లడైంది. ఇప్పటికే చాలా ప్రపంచ బ్యాంక్‌‌ల్లో దీన్ని వాడుతున్నారు. రిలేషన్‌‌షిప్ మేనేజర్లకు ఏజెంటిక్‌‌ ఏఐ వరంలా మారింది. అడ్మినిస్ట్రేటివ్ వర్క్‌‌లోడ్‌‌తో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఇది పనిభారాన్ని తగ్గించింది. దాంతో ఇప్పుడు క్లయింట్లతో డైరెక్ట్‌‌గా మాట్లాడేందుకు మేనేజర్లకు చాలా టైం దొరుకుతోంది. అంతేకాదు.. ఇది బ్యాంకుల ఫ్రంట్‌‌లైన్ సేల్స్‌‌ను వేగంగా పెంచుతోంది.  

సాధారణ జనరేటివ్ ఏఐతో పోలిస్తే ఏజెంటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్‌‌డ్‌‌ టెక్నాలజీ. ట్రెడిషనల్ ఏఐ ప్రాంప్ట్స్‌‌కు మాత్రమే రెస్పాండ్ అవుతుంది. కానీ, ఏజెంటిక్ ఏఐ స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. టాస్క్‌‌లను పూర్తి చేస్తుంది. దీనికి మనుషుల సాయం పెద్దగా అవసరం ఉండదు. బ్యాంకింగ్‌లో కస్టమర్ సర్వీస్, రిస్క్ మేనేజ్‌‌మెంట్ లాంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. మెకిన్సీ నివేదిక ప్రకారం.. ఇది ప్రొడక్షన్‌తోపాటు, ఆదాయాన్ని 3–15 శాతం వరకు పెంచగలదు. సర్వీస్‌‌ కాస్ట్‌‌ని 20–40 శాతం వరకు తగ్గించగలదు.