అన్ని బ్యాంకుల పనివేళలు ఒకే సమయంలో ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టారు అధికారులు. కొన్ని బ్యాంకులు కొంత టైం వరకే పని చేస్తాయి. అలా కాకుండా ఇకపై రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళలు ఇవాళ్టి నుంచి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 2:30 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఇదే టైంను పాటించ నున్నట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ తెలిపింది. ప్రతి ఆదివారంతో పాటు రెండు, నాలుగు శనివారాల్లో బ్యాంకులకు యథావిధిగా సెలవు ఉంటుంది.

