కస్టమర్ల దగ్గరికి బ్యాంకులే వెళ్లాలి

కస్టమర్ల దగ్గరికి బ్యాంకులే వెళ్లాలి

న్యూఢిల్లీ: బ్యాంకులు దేశ సంపదను  పెంచుతున్న, జాబ్స్ క్రియేట్ చేస్తున్న వారికి సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా నిలవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తమ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ షీట్‌‌‌‌‌‌‌‌లను మెరుగుపరుచుకుంటూనే దేశ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ షీటును మెరుగుపరచాలని చెప్పారు. ‘బిల్డ్ సినర్జీ ఫర్ సీమ్‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌ క్రెడిట్ ఫ్లో అండ్ ఎకనామిక్‌‌‌‌‌‌‌‌ గ్రోత్‌‌‌‌‌‌‌‌’ సింపోజియంలో బ్యాంకర్లను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. బిజినెస్‌‌‌‌‌‌‌‌లకు సాయం  చేసేందుకు బ్యాంకులు పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ మోడల్‌‌‌‌‌‌‌‌ను అలవాటు చేసుకోవాలని సలహాయిచ్చారు. ‘వెల్త్‌‌‌‌‌‌‌‌ను, జాబ్స్‌‌‌‌‌‌‌‌ను క్రియేట్ చేసే వారికి బ్యాంకులు కచ్చితంగా సపోర్ట్ చేయాలి. బ్యాంకులు తమ సొంత బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ షీట్లతో దేశ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ షీట్‌‌‌‌‌‌‌‌ను పెంచే టైమ్ వచ్చింది’ అని ఆయన పేర్కొన్నారు.

బిజినెస్‌‌‌‌‌‌‌‌లు, మైక్రో, స్మాల్‌‌‌‌‌‌‌‌, మీడియం ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌‌‌‌‌కు కస్టమైజ్డ్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను అందించాలని చెప్పారు. కస్టమర్లు బ్యాంకులకు వస్తారని వెయిట్ చేయకండి, మీరే వారి దగ్గరకు వెళ్లండి అని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకుల దగ్గర గత ఐదేళ్లలో కంటే ఎక్కువ లిక్విడిటీ ఉందని, కరోనా సంక్షోభం ఉన్నా, ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌–సెప్టెంబర్ మధ్య బ్యాంకింగ్ సెక్టార్ బలంగా ఉందని చెప్పారు. రూ. 2 లక్షల కోట్ల మొండిబాకీలను రికవరీ చేసేందుకు ఎన్​ఏఆర్​సీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.  

మొదటి ఫార్మా ఇన్నోవేటివ్ సమ్మిట్‌‌‌‌‌‌‌‌..
ఈ ఏడాది కనీసం 100 దేశాలకు 6.5 కోట్ల వ్యాక్సిన్ డోస్‌‌‌‌‌‌‌‌లను ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ చేశామని ఫార్మా సమ్మిట్‌‌‌‌‌‌‌‌లో మోడీ పేర్కొన్నారు.  దేశ హెల్త్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  ప్రపంచ దేశాల నమ్మకం పెరిగిందని, దీంతో ఇండియాను ‘ఫార్మశీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ది వరల్డ్‌‌‌‌‌‌‌‌’ గా పిలుస్తున్నారన్నారు. ఇండస్ట్రీ వర్గాలతో చర్చలు జరిపాక పాలసీలను క్రియేట్ చేశామని చెప్పారు.