తెలంగాణ బీజేపీకి మళ్లీ ఇన్చార్జిగా బన్సల్.. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‎గా కమలం పార్టీ స్కెచ్

తెలంగాణ బీజేపీకి మళ్లీ ఇన్చార్జిగా బన్సల్.. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‎గా కమలం పార్టీ స్కెచ్
  • తమిళనాడు కో ఇన్​చార్జిగా 
  • డీకే అరుణ, కర్నాటక 
  • కో ఇన్​చార్జిగా కాసం వెంకటేశ్వర్లు
  • 29 రాష్ట్రాలు, 7 యూటీలకు బాధ్యుల నియామకం
  • పార్టీ హెడ్ ఆఫీస్ ఇన్​చార్జి 
  • తరుణ్​ చుగ్ ఉత్తర్వులు

 న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ బీజేపీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జీగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌‌‌‌‌‌‌‌ను ఆ పార్టీ హైకమాండ్ నియమించింది. అలాగే, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అదనపు బాధ్యతలను ఆయనకు అప్పగించింది. రాష్ట్ర సహ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిలుగా పార్టీ సీనియర్ నేతలు అభయ్ పాటిల్, రేఖా శర్మ పేర్లను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిలు, కో ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిలను పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నియమించారు. ఈ మేరకు బుధవారం పార్టీ నేషనల్ హెడ్ ఆఫీస్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి, ఎంపీ తరుణ్ చుగ్ ఉత్తర్వులు జారీ చేశారు. 

హర్యానా, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీని ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా, ఈ రెండు రాష్ట్రాలకు సిద్ధార్థ్ శంభును కో ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా నియమించింది. వెస్ట్ బెంగాల్‌‌‌‌‌‌‌‌కు లాల్‌‌‌‌‌‌‌‌సింగ్ ఆర్య, రాజేంద్ర సింగ్, పింకీ కుష్వాహాకు  కో ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి బాధ్యతలను అప్పగించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్‌‌‌‌‌‌‌‌ పార్టీ వ్యవహారాలను జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పర్యవేక్షించనున్నారు. 

ఈయనకు సహాయకులుగా జగదీప్ పటేల్, మేధా కులకర్ణి, ప్రదీప్ శర్మ, అనంత్ ఓజాకు బాధ్యతలు ఇచ్చింది. మహారాష్ట్రకు బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండాను ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా, అమిత్ మాలవీయ, సదానంద్ షెట్ తానవాడే, కమల్ జీత్ సెహ్రావత్‌‌‌‌‌‌‌‌ను కో ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిలుగా ప్రకటించింది. మరోవైపు ఏపీ రాష్ట్ర ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా అరవింద్ భదౌరియా, కో ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా వనతి శ్రీనివాసన్, ఢిల్లీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా వినయ్ సహస్రబుద్ధే, గుజరాత్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా తరుణ్ చుగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

డీకే అరుణ, కాసంకు కో ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి బాధ్యతలు..

ఈ నూతన నియామకాల్లో తెలంగాణతోపాటు ఏపీకి చెందిన పలువురు సీనియర్ నేతలకు బీజేపీ హైకమాండ్ పలు రాష్ట్రాల బాధ్యతలు అప్పగించింది. బీజేపీ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్‌‌‌‌‌‌‌‌కు తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా బాధ్యతలు అప్పగించింది. అలాగే, తెలంగాణకు చెందిన ఎంపీ డీకే అరుణను తమిళనాడు, కాసం వెంకటేశ్వర్లును కర్నాటక కో ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిలుగా పార్టీ నియమించింది. ఒడిశా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా  ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహరించనున్నారు. వీటితోపాటు బీజేపీ కమ్యూనికేషన్ సెల్ కో –ఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనిల్ బలూని, కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆశిష్ అగర్వాల్‌‌‌‌‌‌‌‌ను నియమించింది. తక్షణమే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని తరుణ్ చుగ్‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేశారు. 

మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైండ్‌‌‌‌‌‌‌‌గా సునీల్ బన్సల్ 

ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సునీల్‌‌‌‌‌‌‌‌ బన్సల్‌‌‌‌‌‌‌‌ గ్రాస్ రూట్ లెవల్‌‌‌‌‌‌‌‌లో బలమైన పట్టు సాధించారు. అదే అనుభవంతో యూపీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహాత్మక విజయాల వెనక మాస్టర్ మైండ్‌‌‌‌‌‌‌‌గా నిలిచారు. అలాగే, ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా ఒడిశాలోనూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బన్సల్ మాస్టర్ ప్లాన్‌‌‌‌‌‌‌‌తో పని చేశారు. 

తెలంగాణలో మునుగోడు బై ఎలక్షన్ వేళ తొలిసారి సునీల్ బన్సల్‌‌‌‌‌‌‌‌ను తెలంగాణ రాజకీయాల్లోకి హైకమాండ్ పంపింది. అనంతరం మారిన పరిణామాలతో ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి ఎవరన్నది స్పష్టంగా లేకపోయినా.. రాష్ట్ర వ్వవహారాలను సునీల్ బన్సల్‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షించారు. ఇదే టైంలో  వెస్ట్ బెంగాల్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన వ్యూహాలతోనే వెస్ట్ బెంగాల్‌‌‌‌‌‌‌‌లో పార్టీ గెలుపొందిందని ఆ పార్టీ నాయకత్వం భావించింది.

ఎన్నికల్లో సరికొత్త వ్యూహాలు, బూత్ కమిటీల ఏర్పాటు, ప్రతి ఇంటికీ బీజేపీని చేర్చడం, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారంలాంటి అన్ని అంశాలను తెర వెనుక నుంచి బన్సల్ అమలు చేశారు. కాగా.. ప్రస్తుతం బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో మళ్లీ బన్సల్‌‌‌‌‌‌‌‌కు బాధ్యతలు అప్పగించిందని పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు.