
వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు బాపట్ల ఎంపీ నందిగం సురేష్. పార్టీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ సమయంలో సురేష్ మాట్లాడుతూ.. తాను ఇదే రాజధాని ప్రాంతంలో పొలం పనులు చేసుకొనే వాడినని అన్నారు. ఆర్థిక నేపథ్యం లేని తనను ఎంపీగా గెలిపించి పార్లమెంట్ కు పంపిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. కూలీ పనులకు వెళ్లే తమ లాంటి వారికి ఎంపీలుగా అవకాశం ఇచ్చారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు సురేష్. మీరు ఎంపీలుగా గెలిచిన క్షణం నుండి మీ మీద బాధ్యత పెరిగిందంటూ సురేష్ కు సూచించారు జగన్.