అమెరికాను ఇబ్బందుల్లోంచి గట్టెక్కించేది ఆయనే

అమెరికాను ఇబ్బందుల్లోంచి గట్టెక్కించేది ఆయనే
  • బిడెన్ కు సపోర్టుగా ఒబామా వీడియో మెస్సేజ్

వాషింగ్టన్: డెమొక్రటిక్​ పార్టీ కేండిడేట్, మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్ కు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా మద్దతు ప్రకటించారు. సుదీర్ఘకాలం వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన బిడెన్.. కష్ట సమయాల్లో దేశాన్ని ఏకతాటిపై నడిపింగలడని, ఇబ్బందుల్లోంచి గట్టెక్కించగలడని అన్నారు. ‘‘ విపత్కర పరిస్థితులలో దేశానికి మార్గనిర్దేశం చేయగలిగే అనుభవం ఆయనకుంది. 2008లో బిడెన్​ను వైస్ ప్రెసిడెంట్​గా ఎంపిక చేసుకోవడం నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటి”అంటూ 12 నిమిషాల వీడియోను ఒబామా ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ప్రెసిడెంట్​కు కావాల్సిన అన్ని సామర్థ్యాలు బిడెన్​కు ఉన్నాయని, రిపబ్లికన్​లను ఓడించేందుకు డెమొక్రటిక్ మద్దతుదారులంతా సాయం చేయాల్సిన టైం వచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఉన్న అవినీతి, అజాగ్రత్త, సెల్ఫ్ డీలింగ్, అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడాలని ఒబామా పిలుపునిచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల రేసు నుంచి సెనెటర్​ బెర్నీ సాండర్స్ తప్పుకున్న తర్వాత డెమొక్రటిక్​ పార్టీ కేండిడేట్, మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్ కు లైన్​క్లియర్​ అయింది. ఈ ఏడాది నవంబర్​ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్​ పార్టీ తరఫున బిడెన్.. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై తలపడనున్నారు.