బాసర ట్రిపుల్ ఐటీలో పాత పద్ధతిలోనే అడ్మిషన్లు

బాసర ట్రిపుల్ ఐటీలో పాత పద్ధతిలోనే అడ్మిషన్లు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఈ విద్యా సంవ‌త్సరం పాత పద్ధతిలోనే అడ్మిషన్లు జరగనున్నాయి.  పదో తరగతి మార్కుల ఆధారంగానే విద్యార్థుల ఎంపిక జరగనుందని  బాసర ట్రిపుల్ ఐటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాదికి సంబంధించి త్వరలోనే  నోటిఫికేషన్ విడుద‌ల చేయనున్నారు.  గతేడాది కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించనందున పాలిసెట్ లో వచ్చిన మార్కుల  ద్వారా విద్యార్థులకు అడ్మిషన్ల ను కల్పించారు. అయితే ఈ విద్యా సంవ‌త్సరం టెన్త్‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు జరగనున్నట్లుగా  బాసర ట్రిపుల్ ఐటీ  ప‌రిపాల‌నాధికారి డాక్టర్ వై రాజేశ్వర్ రావు తెలిపారు.