బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి బీజేపీ యత్నం..మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి అరెస్ట్​

బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి బీజేపీ యత్నం..మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి అరెస్ట్​

బాసర, వెలుగు: నిర్మల్ జిల్లా ట్రిపుల్ ఐటీ కాలేజీ వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల క్యాంపస్​లో వరుసగా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, ఆ ఘటనలను నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ఆధ్వర్యంలో ట్రిపుల్ ఐటీ ముట్టడికి యత్నించారు. దీంతో యూనివర్సిటీ మెయిన్​ గేటు దగ్గర పోలీసులు వీరిని అడ్డుకున్నారు. అయినా, క్యాంపస్​లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. 

దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసి స్థానిక పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా గీతామూర్తి మాట్లాడుతూ పోలీసులు రాష్ట్ర సర్కారుకు అనుకూలంగా వ్యవహరించడం కరెక్ట్ ​కాదన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ లీడర్లు మెడిసెమ్మ రాజు పాల్గొన్నారు.