
కరోనా తరువాత చాల మందిలో మంచి ఆహారం, వ్యాయామం గురించి తెలిసొచ్చింది. కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్న ఈ కాలంలో ఎవరు ఎలాంటి అనారోగ్యానికి గురవుతున్నారో ఊహించలేకపొతున్నారు. అనూహ్యంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాల కేసులు కూడా ప్రజల్ని భయపెడుతున్నాయి. అయితే వీటన్నిటికీ వ్యాయామంతో పాటు తినే ఆహరం పై కూడా దృష్టిపెట్టాలి అని చెబుతున్నారు నిపుణులు. మరోవైపు పిల్లల్లో కూడా వయస్సుకు మించి బరువు పెరగడం కూడా ఆందోళన కలిగిస్తుంది ముఖ్యంగా సిటీ నగరాల్లో. దీనికి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు CBSE ఒకడుగు ముందుకు వేసింది.
స్కూల్ విద్యార్థుల్లో పెరుగుతున్న ఊబకాయ(obesity) సమస్యను పరిష్కరించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అన్ని అనుబంధ స్కూళ్ళకి తాజాగా ఆదేశాలను జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం విద్యార్థుల్లో హెల్తి లైఫ్ స్టయిల్ ప్రోత్సహించడానికి స్కూల్స్ ఇప్పుడు 'ఆయిల్ బోర్డును' ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ బోర్డులు విద్యార్థులకు రిమైండర్లుగా పనిచేస్తాయి, అంటే మనం తినే నూనె పదార్ధాల వల్ల ఆరోగ్యంపై చూపే చెడు ప్రభావాన్ని తెలియజేస్తాయి.
భారతదేశంలో పెరుగుతున్న ఊబకాయం కేసులు: CBSE ప్రకారం, 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) సిటీ ప్రాంతాల్లో ప్రతి ఐదుగురిలో ఒకరికి అధిక బరువు(overweight) లేదా ఊబకాయం(obesity) ఉందని వెల్లడించింది. 2025లో వచ్చిన లాన్సెట్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (GBD) అధ్యయనం 2021 ప్రకారం, భారతదేశంలో అధిక బరువు, ఊబకాయం ఉన్నవారు 2021లో ఉన్న 18 కోట్ల నుండి 2050 నాటికి 44.9 కోట్లకు పెరుగుతుందని అంచనా.
CBSE కొత్త ఆదేశాలు: ఆహారంలో ఉపయోగించే నూనె మోతాదు గురించి పిల్లలలో అవగాహన పెంచడానికి స్కూల్స్ ఇప్పుడు 'ఆయిల్ బోర్డులను' ఏర్పాటు చేస్తాయి.
* ఇప్పుడు అన్ని అఫీషియల్ డాకుమెంట్స్ లో ఊబకాయం నివారణకు సంబంధించిన మెసేజెస్ ఉంటాయి.
* జంక్ ఫుడ్ కంటే పోషకమైన ఆహారానికి ప్రాధాన్యత ఇస్తుంది అలాగే క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాన్ని ప్రోత్సహిస్తుంది.
* విద్యార్థులు లిఫ్ట్‌కు బదులుగా మెట్లను ఉపయోగించమని ప్రోత్సహిస్తుంది.
* స్కూల్స్ సౌలభ్యం ఇంకా సృజనాత్మకతకు అనుగుణంగా ఈ 'ఆయిల్ బోర్డును' రూపొందించవచ్చు.
ఆరోగ్యకరమైన లైఫ్ స్టయిల్ ప్రోత్సహించడానికి ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి నాన్-కమ్యూనికేషన్ వ్యాధుల పెరుగుదలను ఎదుర్కోవడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జూన్‌లో స్కూల్స్, ఆఫీసులు, వివిధ డిపార్ట్మెంట్లు పిజ్జాలు, బర్గర్‌లతో పాటు సమోసాలు, వడ పావ్, కచోరి వంటి ఆహార పదార్థాలలో నూనె, చక్కెర కంటెంట్ సూచించే బోర్డును పెట్టాలని ప్రతిపాదించింది.
ప్రధాని మోదీ పిలుపు: ఈ సంవత్సరం మార్చి ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఊబకాయం సమస్యను ఎత్తి చూపుతూ వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని, ఊబకాయాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ చురుగ్గా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. వంట నూనె వినియోగాన్ని తగ్గించడం వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తుచేశారు కూడా.