IND vs ENG 2025: నువ్వు సూపర్ స్టార్ అయినా అలా చేయడానికి కుదరదు: బుమ్రాకు గవాస్కర్ వార్నింగ్

IND vs ENG 2025: నువ్వు సూపర్ స్టార్ అయినా అలా చేయడానికి కుదరదు: బుమ్రాకు గవాస్కర్ వార్నింగ్

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగో టెడ్స్ ఆడతాడా లేదా అనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. పని భారం కారణంగా ఈ స్పీడ్ స్టార్ సిరీస్ లో ఏవైనా మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడనున్నాడు. ఇప్పటికే బుమ్రా రెండు మ్యాచ్ లు ఆడేశాడు. మిగిలిన రెండు టెస్టుల్లో ఒకటే మ్యాచ్ ఆడతాడనే టాక్. రెండో టెస్టుకు ముందు ముందే బుమ్రా సిరీస్‎లోని ఏవైనా మూడు మ్యాచులు మాత్రమే ఆడుతాడని.. మిగిలిన రెండు మ్యాచ్ ల్లో అతడి సేవలు కోల్పోతామని గిల్ రెండో టెస్టుకు ముందు క్లారిటీ ఇచ్చాడు. దీంతో బుమ్రా నాలుగో టెస్ట్ ఆడతాడా లేకపోతే ఐదో టెస్ట్ టెస్టులో బరిలోకి దిగుతాడా అనే విషయంపై చర్చల జరుగుతున్నాయి. 

5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ మాంచెస్టర్ లో జూలై 23 నుంచి ప్రారంభమవుతుంది. సిరీస్ లో వెనకబడిన టీమిండియా ఓల్డ్ ట్రాఫర్డ్ లో జరగబోయే నాలుగో టెస్టులో ఓడిపోయితే సిరీస్ కోల్పోతుంది. దీంతో నాలుగో టెస్టులో ఎలాగైనా గెలవాలనే ఒత్తిడి భారత జట్టుపై ఉంది. ఈ మ్యాచ్ లో బుమ్రాకు రెస్ట్ ఇస్తారనే విషయంలో వస్తున్న ప్రచారంలో భాగంగా టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఈ టీమిండియా స్టార్ పేసర్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. 

గవాస్కర్ మాట్లాడుతూ.."ఏ సూపర్ స్టార్ ఆటగాడూ విశ్రాంతి తీసుకోకూడదు. మీరు ఇక్కడకు సెలవుల కోసం రాలేదు" అని గవాస్కర్ సోనీ స్పోర్ట్స్‌లో అన్నారు. గవాస్కర్ బుమ్రాను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. టీమిండియా వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా బుమ్రా చివరి టెస్ట్ ఆడకపోయినా పర్లేదు సిరీస్ కు కీలకమైన నాలుగో టెస్ట్ ఆడాలని సూచించాడు. మూడో టెస్ట్ ముగిసిన తర్వాత నాలుగో టెస్టుకు 10 రోజుల విరామం ఉంది. విరామం ఎక్కువ రావడంతో బుమ్రా నాలుగో టెస్ట్ ఆడాలని గవాస్కర్ గట్టిగా చెప్పాడు.

ALSO READ : BCCI: మా విధానం అదే.. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్‌పై మౌనం వీడిన బీసీసీఐ

లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా ఆడాడు. ఈ మ్యాచులో ఈ  పేసర్ చెలరేగి తొలి ఇన్నింగ్స్ లో ఐదు పడగొట్టిన టీమిండియాకు ఓటమి తప్పలేదు. రెండో టెస్టులో టీమిండియా ఖచ్చితంగా గెలవాల్సిన టెస్టులో బుమ్రా ఆడతాడని ప్రచారం జరిగినా అతనికి రెస్ట్ ఇవ్వడం జరిగింది. బుమ్రా లేని ఈ టెస్టులో టీమిండియా 336 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తాజాగా ముగిసిన లార్డ్స్ టెస్టులో బుమ్రా రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 7 వికెట్లు పడగొట్టిన టీమిండియా 22 పరుగుల  తేడాతో ఓడిపోయింది.