విద్యార్థుల తల్లిదండ్రులతో అధికారుల చర్చలు విఫలం

విద్యార్థుల తల్లిదండ్రులతో అధికారుల చర్చలు విఫలం
  • త్వరలో ఆందోళనకు దిగుతామన్న విద్యార్థులు
  • ముందస్తుగా సెలవులు ప్రకటించిన వర్సిటీ ఆఫీసర్లు
  • ఇంటికి వెళ్లేది లేదని స్పష్టం చేసిన స్టూడెంట్లు​

భైంసా, వెలుగు: బాసర ట్రిపుల్‌ ఐటీలో సమస్యల పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెలరోజులైనా అమలు కాలేదు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ స్టూడెంట్లు రాష్ట్ర సర్కార్‌‌కు విధించిన డెడ్‌లైన్‌ శనివారంతో ముగిసింది. దీంతో మళ్లీ ఆందోళనలకు దిగేందుకు స్టూడెంట్లు సిద్ధమవుతున్నారని తెలియగానే వర్సిటీ ఉన్నతాధికారులు 9 రోజులు సెలవులు ప్రకటించారు.

అలాగే తల్లిదండ్రులను పిలిపించి చర్చించారు. డిమాండ్లు త్వరలోనే పరిష్కరిస్తామని, ఆందోళన చేయకుండా స్టూడెంట్లను ఒప్పించాలని చెప్పినట్లు తెలిసింది. అయితే చర్చలు సంతృప్తికరంగా లేవని, స్టూడెంట్లు వర్సిటీ అధికారులు చేసిన ప్రతిపాదనకు ఒప్పుకోవడం లేదని మీడియాకు మీడియాకు తెలిపారు. డిమాండ్లు సాధించుకునేదాకా వెనక్కి తగ్గమని... త్వరలోనే ఆందోళనకు దిగుతామని విద్యార్థులు ప్రకటించారు.

తమ డిమాండ్ల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్లు జూన్‌‌‌‌‌‌‌‌ 14 నుంచి 20 వరకు క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో ఆందోళన చేపట్టారు. జూన్ 20న మంత్రి సబితా క్యాంపస్‌‌‌‌‌‌‌‌కు వచ్చి ఇచ్చిన హామీతో స్టూడెంట్లు ఆందోళన విరమించారు. కాగా, మంత్రి హామీ ఇచ్చి నెల అవుతున్నా ఇప్పటివరకు క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. దీంతో స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ (ఎస్‌‌‌‌‌‌‌‌జీసీ) ఈ నెల 16న వర్సిటీ డైరెక్టర్ సతీశ్‌‌‌‌‌‌‌‌కు బహిరంగ లేఖ రాసి డెడ్ లైన్ విధించింది. డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన కంటిన్యూ చేస్తామని ప్రకటించారు. వర్షాలు, పరీక్షల నేపథ్యంలో చర్చించి త్వరలో తేదీ ప్రకటిస్తామన్నారు.
31 వరకు సెలవులు
ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి వీసీ వెంకటరమణ ఇంజనీరింగ్ త్రీ(ఈ3) విద్యార్థులకు సెమిస్టర్ బ్రేక్​హాలిడేస్ ప్రకటించారు. ఆందోళనలో వీళ్లే కీలకం కావడంతో ఈ నెల 31 వరకు 9 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆఫీసర్ల తీరుపై మండిపడుతున్నారు. ఇంటికి వెళ్లేది లేదని, డిమాండ్లన్నీ పరిష్కారం అయ్యేదాకా ఆందోళనలు ఉధృతం చేస్తామని తేల్చి చెప్పారు. 
నెరవేరని డిమాండ్లు..
9 వేల మంది విద్యార్థులు చదువుతున్న బాసర ట్రిపుల్ ఐటీలో రెగ్యులర్ వీసీని నియమించ లేదు. దీంతో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీసీని నియమించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. దీంతో పాటు మూడేండ్ల క్రితం అడ్మిషన్ పొందిన స్టూడెంట్లకు ​ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు ఇవ్వాలని, లెక్చరర్లను నియమించాలని, హాస్టల్ రూమ్‌‌‌‌‌‌‌‌లకు మరమ్మతులు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. 
భారీగా పోలీసుల మోహరింపు
విద్యార్థులు మరోసారి ఆందోళన బాట పడుతున్నందున పోలీసు శాఖ అలర్ట్ అయ్యింది. దీంతో పోలీసులు క్యాంపస్‌‌‌‌‌‌‌‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వర్సిటీలోని అన్ని విభాగాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ, బీ, సీ బ్లాక్‌‌‌‌‌‌‌‌లు, హాస్టళ్ల నుంచి విద్యార్థులను బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మెయిన్ గేటు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. 
డిమాండ్లపై వెనక్కి తగ్గం: స్టూడెంట్లు
గడువులోగా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడంలో సర్కారు విఫలమైందని, వాటిని సాధించుకునేదాకా తమ పోరాటం ఆగదని విద్యార్థులు తెలిపారు. మరోసారి నిరసన చేపడతామని, త్వరలోనే దీక్షల తేదీని ప్రకటిస్తామని శనివారం అర్ధరాత్రి ట్విటర్​లో ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఐటీ ఎస్‌‌‌‌‌‌‌‌జీసీ పేరుతో  ప్రెస్‌‌‌‌‌‌‌‌నోట్‌‌‌‌‌‌‌‌ రిలీజ్​చేశారు. ఆదివారం నుంచి నిరసన చేపట్టాలని అనుకున్నప్పటికీ వర్షాల వల్ల జిల్లాలో రెడ్‌‌‌‌‌‌‌‌ అలర్ట్‌‌‌‌‌‌‌‌ జారీ చేయడం, పీయూసీ 1, పీయూసీ 2 విద్యార్థులకు  త్రైమాసిక పరీక్షలు జరుగుతుండడంతో తాత్కాలితంగా వాయిదా వేస్తున్నామన్నారు. కొద్దిరోజుల క్రితం ఫుడ్‌‌‌‌‌‌‌‌ పాయిజన్‌‌‌‌‌‌‌‌ వల్ల  ఆసుపత్రిపాలైన విద్యార్థుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అధికారుల చర్చలు ఫెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

స్టూడెంట్లు మళ్లీ ఆందోళనలు బాట పడుతుండటంతో వర్సిటీ అధికారులు స్టూడెంట్ల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. శనివారం ఉదయం పలువురు విద్యార్థుల పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వర్సిటీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి వీసీతో పాటు డైరెక్టర్ సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆఫీసర్లు మీటింగ్ నిర్వహించారు. స్టూడెంట్స్ డిమాండ్లు త్వరలోనే పరిష్కరిస్తామని, ఆందోళన చేయకుండా వారిని ఒప్పించాలని చెప్పినట్లు తెలిసింది.

మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత పేరెంట్స్ వర్సిటీ బయట మీడియాతో మాట్లాడారు. చర్చలు సంతృప్తికరంగా లేవని, స్టూడెంట్స్ ఒప్పుకోవడం లేదని ​తెలిపారు. 12 డిమాండ్లలో రెండు డిమాండ్లకే అధికారులు ఒప్పుకున్నారని, మిగతా 10 డిమాండ్లను దశల వారీగా పరిష్కరిస్తామని చెబుతున్నారని, వీటిని స్టూడెంట్లతో పాటు తాము ఒప్పుకోవడం లేదన్నారు. తమ పిల్లలకు ఏం జరిగిన ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.