
బాలీవుడ్ కింగ్ షారున్ ఖాన్ తో కలిసి 'జవాన్' వంటి బ్లాక్‌బస్టర్ మూవీని తెరపైకి ఎక్కించి ప్యాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగారు అట్లీ. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ సినీ ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకునే అంతలా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రూ. 800 కోట్ల సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరోవైపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో యాడ్ కు దర్శకత్వం వహిస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు.
అల్లు అర్జున్-అట్లీ కాంబో..
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ AA22xA6 . ఈ చిత్రం భారతీయ సినీ ఇండస్ట్రీ స్థాయిలో ఉంటుందని అంచనాలు పెంచుతోంది. రూ. 600 కోట్ల నుంచి రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో అల్లు అర్జున్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె నటిస్తుండగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం సినిమా కాదు, ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోయే ఒక ప్రయోగమని అట్లీ ఇప్పటికే ప్రకటించారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, హాలీవుడ్ మార్కెటింగ్ ఏజెన్సీ సహకారాన్ని కూడా తీసుకుంటున్నారంటే ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
సినిమా బడ్జెట్‌ను మించిన యాడ్!
అల్లు అర్జున్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న అట్లీ, 'చింగ్స్ దేశీ చైనీస్' బ్రాండ్ కోసం ఏకంగా రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఒక ప్రకటనకు దర్శకత్వం వహించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ అడ్వర్టైజ్‌మెంట్‌కు రణ్‌వీర్ సింగ్ ప్రధాన ఆకర్షణ కాగా, దక్షిణాదిలో అపారమైన క్రేజ్ ఉన్న యువ నటి శ్రీలీల కూడా భాగం కావడం విశేషం. ఈ ప్రకటనలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మొత్తం బడ్జెట్‌లో నటీనటుల పారితోషికాలు, భారీ సెట్టింగులు, అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ (VFX) పనులు కీలకంగా ఉన్నాయి. ఈ ప్రకటనను భారత్‌లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత ఖరీదైన యాడ్ గా పేర్కొంటున్నారు.
ALSO READ : ‘తెలుసు కదా’ ఫుల్ రివ్యూ..
విజువల్ వండర్‌గా..
ప్రస్తుతం ఒక యాడ్ కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేయడం అనేది చిన్నపాటి ప్యాన్ ఇండియా సినిమా బడ్జెట్‌ను మించిపోవడం చూస్తే.. సినీ విశ్లేషకులే ఆశ్చర్యపోతున్నారు. ఈ అసాధారణమైన బడ్జెట్‌కు తగ్గట్టే, అట్లీ ఈ ప్రకటనను ఒక విజువల్ వండర్‌గా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే విధంగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈ రూ. 150 కోట్ల యాడ్‌లో ఎలాంటి కథాంశాన్ని చూపించబోతున్నారు, శ్రీలీల పాత్ర ఎంత ప్రత్యేకంగా ఉండబోతుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం.. యాడ్ విడుదలయ్యే వరకు వేచి చూడక తప్పదు. మరోవైపు, అల్లు అర్జున్ అభిమానులు సైతం వారి అభిమాన హీరో సినిమా (AA22xA6) 2027 లో విడుదల కావడం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.