
ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌లో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబరిచింది. జాతీయ ర్యాంకింగ్‌లో 3వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా గిరిజన సమూహాలకు న్యాయం చేయడం, వారు నివసించే ప్రాంతాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేసి మూడో స్థానంలో నిలిచింది.
అలాగే.. తెలంగాణలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ పద్మ పి.విని సూపర్ కోచ్‌లు/రాష్ట్ర మాస్టర్ ట్రైనర్‌లలో ఒకరిగా సత్కరించారు. అక్టోబర్ 17న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఆది కర్మయోగి జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా తెలంగాణ ప్రభుత్వం తరపున సెక్రెటరీ కోఆర్డినేషన్ డా. గౌరవ్ ఉప్పల్ అవార్డులను స్వీకరించారు.
బెస్ట్ పెర్ఫార్మర్స్ స్క్రీన్ డిస్‌ప్లే..
1.ఆదికర్మయోగి అభియాన్ - ఆదిలాబాద్, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం
2.ఉత్తమ ప్రదర్శన సూపర్ కోచ్/రాష్ట్ర మాస్టర్ ట్రైనర్ - డాక్టర్ కీర్తి
3.ధార్తీ అభా జనభాగిదారి అభియాన్ - ఆదిలాబాద్, ఆసిఫాబాద్