IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. హర్షిత్, నితీష్‌లకు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. హర్షిత్, నితీష్‌లకు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

టీమిండియా ఏడు నెలల గ్యాప్ తర్వాత తొలిసారి వన్డే క్రికెట్ ఆడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు సిద్ధమవుతోంది. ఈ మెగా సిరీస్ లో టీమిండియా వన్డే కెప్టెన్ గా రోహిత్ స్థానంలో గిల్ సారధిగా జట్టును నడిపించనున్నాడు. కుర్రాళ్ళు, సీనియర్లతో నిండిన భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో ఆదివారం (అక్టోబర్ 19) జరగబోయే తొలి వన్డేలో టీమిండియా ప్లేయింగ్ 11 పై ఆసక్తి నెలకొంది. పెర్త్ వేదికగా జరగబోయే తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం..    

ఓపెనర్లుగా కెప్టెన్ గిల్ తో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. టాలెంటెన్డ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. మూడో స్థానంలో కోహ్లీ స్థానానికి తిరుగులేదు. నాలుగో స్థానంలో వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బరిలోకి దిగుతాడు. ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ గా రాహుల్ బ్యాటింగ్ చేయనున్నాడు. వికెట్ కీపర్ ధృవ్ జురెల్ కు ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోవడం కష్టమే. జట్టులో హార్దిక్ పాండ్య లేకపోవడంతో ఆరో స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి  ప్లేయింగ్ 11 లో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఏడో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది.

వాషింగ్ టన్ సుందర్ ఉన్నప్పటికీ సీనియర్ గా అక్షర్ పటేల్ ను ఆడించే ఆలోచనలో భారత యాజమాన్యం ఉంది. ఫాస్ట్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేయడంతో హర్షిత్ రానాకు 8 వ స్థానంలో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏకైక స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ తుది జట్టులో స్థానం ఖాయం. ఫాస్ట్ బౌలర్లుగా సిరాజ్ తో పాటు అర్షదీప్ కొత్త బంతిని పంచుకోనున్నాడు. ప్రసిద్ కృష్ణ  బెంచ్ కే పరిమితం కావొచ్చు. 15 మంది స్క్వాడ్ లో జైశ్వాల్, జురెల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణలకు తొలి వన్డే తుది జట్టులో స్థానం దక్కపోవచ్చు.     

తొలి వన్డేకు ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా)  

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి,  కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్

తొలి వన్డేకు ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 (అంచనా)  

మిచెల్ మార్ష్ (కెప్టెన్), కూపర్ కొన్నోలీ, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లాబుస్చాగ్నే, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్