Akkineni Amala: నా కోడళ్లు బంగారం.. వారితో గడిపే ప్రతి క్షణం ఆనందమే!

Akkineni Amala: నా కోడళ్లు బంగారం.. వారితో గడిపే ప్రతి క్షణం ఆనందమే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత గౌరవనీయమైన కుటుంబాలలో ఒకటి అక్కినేని ఫ్యామిలీ.  ఆ ఇంటి కోడలు, నాగార్జున సతీమణి అమల చాలా కాలం తర్వాత తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.  ముఖ్యంగా తన కోడళ్లతో ఉన్న అనుబంధం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. నటనకు, సినిమా ప్రపంచానికి కాస్త దూరంగా ఉన్న అమల.. పాత తరానికి, కొత్త తరానికి మధ్య ఉండాల్సిన ఆరోగ్యకరమైన బంధాన్ని గురించి  తెలియజేశారు.

అత్తగా కోడళ్లతో అనుబంధం..

నటన, సామాజిక సేవ, పెంపుడు జంతువుల సంరక్షణ వంటి కార్యక్రమాలతో అక్కినేని అమల బిజీగా ఉంటారు. తన ఇద్దరు కుమారులైన నాగ చైతన్య, అఖిల్ పెళ్లిళ్ల తర్వాత, అత్తగా తన బాధ్యత, అనుభూతిని ఈ సందర్భంగా తెలియజేశారు. నాకు అద్భుతమైన కోడళ్లు దొరికారు. శోభితా ధూళిపాళ, జైనాబ్ రవ్‌డ్జీ చాలా సంతోషంగా ఉంటారు. నన్ను మరోసారి ఆనందంగా జీవించేలా చేస్తున్నారు. నాకోసం అమ్మాయిల సర్కిల్ ఏర్పడింది అని అన్నారు. వారు బిజీగా ఉన్నప్పటికీ, వారితో గడిపే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తానని తెలిపారు.

ALSO READ : రూ. 150 కోట్లతో శ్రీలీలతో యాడ్ ఏంటి స్వామి..

శోభితా ధూళిపాళ, జైనాబ్ రవ్‌డ్జీలు చాలా బిజీగా ఉంటారు. కానీ అది మంచి విషయం. ఎందుకంటే యువతకు ఉత్తేజకరమైన జీవితం ఉండటం మంచిదని అమల అన్నారు. బిజీగా ఉండటం చాలా సంతోషాన్నిస్తుంది. కానీ, వారితో నాకు కొన్ని క్షణాలు దొరికినప్పుడు, మేము ఎంతో ఆనందంగా గడుపుతాము. నేను నా కోడళ్లు, భర్త నుంచి ఎప్పుడూ అటెంక్షన్ కోరుకునే వ్యక్తిని కాను అని అమల చెప్పుకోచ్చారు.

తల్లిగా కాస్త కఠినంగా.. 

 తన భర్త నాగార్జున అక్కినేని గురించి, తమ పిల్లల పెంపకం గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు అమల. నాగ చైతన్య, అఖిల్  ఇద్దరూ చాలా అద్భుతంగా పెరిగారు. నాగ్ పట్ల వారికి ఆపారమైన గౌరవం ఉంది. ఆయన కూడా వారి పట్ల ఆప్యాయంగా ఉంటారు . కానీ నా విషయానికి వస్తే... కాస్త కఠినంగా, నియమాలను పాటించే తల్లిగా ఉంటానని తెలిపారు. నాగార్జున మొదటి భార్య లక్ష్మి దగ్గుబాటికి నాగ చైతన్య జన్మించారు. 1990లో నాగార్జున, లక్ష్మి విడిపోయిన తర్వాత కూడా, చైతన్యను ఇద్దరూ కలిసి పెంచారు. 1992లో నాగార్జున, అమల వివాహం చేసుకున్న తర్వాత వారికి అఖిల్ అక్కినేని జన్మించారు. 

2024లో నటి శోభిత ధూళిపాళను నాగ చైతన్య వివాహం చేసుకున్నారు. వారి బాటలోనే 2025లో అఖిల్ అక్కినేని ముంబైకి చెందిన ఆర్టిస్ట్, వ్యాపారవేత్త అయిన జైనాబ్ రవ్‌డ్జీని పెళ్లి చేసుకున్నారు. జైనాబ్ విజయవంతమైన వ్యాపారవేత్తల కుటుంబం నుండి వచ్చారు. ఈ కొత్త కోడళ్లు తమ వైవిధ్యభరితమైన నేపథ్యాలు, బిజీ లైఫ్ స్టైల్‌తో అక్కినేని కుటుంబంలోకి సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.