
నిజామాబాద్ లో దారుణం జరిగింది. కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి చంపాడు బైక్ దొంగ. శుక్రవారం ( అక్టోబర్ 17 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి నగర్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. బైక్ దొంగ రియాజ్ ను పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యకు గురయ్యాడు. బైక్ రియాజ్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా.. ప్రమోద్ ఛాతిలో కత్తితో పొడిచాడు రియాజ్.
కత్తితో ఛాతిలో బలంగా పొడవడంతో ఘటనాస్థలంలోనే కుప్పకూలాడు ప్రమోద్. ఈ క్రమంలో ఆసుపత్రికి తరలించే లోపే ప్రమోద్ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
ప్రమోద్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దుండగుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు స్థానికులు. ప్రమోద్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు తోటి ఉద్యోగులు, అధికారులు.