OpenAI: పెద్దలకు మాత్రమే శృంగార కంటెంట్.. చాట్‌జీపీటీ సంచలన నిర్ణయం..!

OpenAI: పెద్దలకు మాత్రమే శృంగార కంటెంట్.. చాట్‌జీపీటీ సంచలన నిర్ణయం..!

చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ చేసిన ఒక సంచలన ప్రకటన డిజిటల్ ప్రపంచంలో పెద్ద చర్చకు తెర తీసింది. డిసెంబర్ 2025 నుండి వెరిఫైడ్ పెద్ద వయసున్న వినియోగదారులు చాట్ జీపీటీ ద్వారా శృంగార (Erotica) కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి, జనరేట్ చేయడానికి అనుమతించబడతారని ప్రకటించారు. ఈ మార్పు “పెద్దలను పెద్దలుగా చూడాలి (treat adults like adults)” అనే కొత్త విధానంలో తీసుకోబడింది. గతంలో మానసిక ఆరోగ్య భద్రతపై దృష్టి సారించిన కఠినమైన నిబంధనల కారణంగా చాట్‌బాట్ వినియోగం పరిమితమైనప్పటికీ.. కొత్త నిర్ణయం వినియోగదారులకు మరింత స్వేచ్ఛను ఇవ్వనుంది.

ఓపెన్ఏఐ పెద్దల కోసం ఆంక్షలను సడలించాలని యోచిస్తోంది. అయితే హానికరమైన, చట్టవిరుద్ధమైన లేదా దోపిడీకి సంబంధించిన కంటెంట్‌ను మాత్రం బ్లాక్ చేయడం కొనసాగుతుందని వెల్లడించింది. ధృవీకరించబడిన పెద్ద వయస్కులు చాట్ జీపీటీ టోన్, స్టైల్, వ్యక్తిత్వంపై మరింత నియంత్రణ కలిగి ఉంటారు. కేవలం ధృవీకరించబడిన యూజర్లు మాత్రమే మెచూర్డ్ కంటెంట్ రూపొందించగలరని కంపెనీ భావిస్తోంది.18 ఏళ్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే అదనపు ఫీచర్స్ అని కంపెనీ చెబుతోంది. 

ALSO READ : దీపావళి తర్వాత వెండి రేట్లు పడిపోతాయా..?

కొత్త నిర్ణయంతో మైనర్‌లకు సున్నితమైన కంటెంట్ అందుబాటులోకి రాకుండా నిరోధిస్తూనే, పెద్దలు బాధ్యతాయుతంగా సృజనాత్మక, లైంగిక కంటెంట్‌ను అన్వేషించడానికి వీలు కల్పిస్తుందని ఓపెన్ ఏఐ సంస్థ తెలిపింది. అలాగే యూజర్లు మానవుడిని పోలిన ప్రతిస్పందనలు, స్నేహపూర్వక పరస్పర చర్యలు, ఎమోజి-రిచ్ చాట్‌లు వంటి ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. అయితే సామ్ ఆల్ట్మాన్ ప్రకటనపై ఆందోళనలు కూడా వినిపిస్తున్నాయి. 

కొందరు వినియోగదారులు శృంగార కంటెంట్‌ను యాక్సెస్ చేసే, మరింత పర్సనలైజ్డ్ ChatGPT అనుభవాన్ని పొందే అవకాశాన్ని స్వాగతించారు. ఇదే సమయంలో మరికొందరు దుర్వినియోగానికి అవకాశం ఉందంటూ భద్రతా చర్యలను ప్రభావవంతంగా అమలు అవసరం గురించి ఆందోళనలు వ్యక్తం చేశారు. రెస్ష్రిక్షన్స్ ఉన్నప్పటికీ.. మైనర్‌లు అడల్ట్ కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చని వారు భయపడుతున్నారు. అలాగే మానసిక ఆరోగ్య నిపుణులు శృంగార కంటెంట్‌కు గురికావడం కొంతమంది వ్యక్తులలో మానసిక ఒత్తిడి లేదా వ్యసనపరమైన ప్రవర్తనలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.