
ఆస్ట్రేలియా, ఇండియా జట్ల మధ్య అక్టోబర్ 19 నుంచి జరగబోయే వన్డే సిరీస్ కు భారీ హైప్ నెలకొంది. ఈ రెండు ప్రపంచంలోనే అగ్ర జట్లు కావడంతో ఈ సిరీస్ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఆడేది మూడు వన్డే మ్యాచ్ లే అయినప్పటికీ టీ20 సిరీస్ కంటే వన్డే సిరీస్ కు ఎక్కువగా క్రేజ్ ఉండడం విశేషం. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి బరిలోకి దిగడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. నయా కెప్టెన్ గిల్ టీమిండియాను నడిపించనున్నాడు.
2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. ఈ హై వోల్టేజ్ సిరీస్ కు రెండు జట్ల స్క్వాడ్, టైమింగ్, షెడ్యూల్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ALSO READ : ఇద్దరు స్టార్ ప్లేయర్లను వదులుకుంటున్న ఢిల్లీ..
ఇండియా, ఆస్ట్రేలియా వన్డే సిరీస్: తేదీలు, వేదికలు
తొలి వన్డే : అక్టోబర్ 19, పెర్త్ స్టేడియం, పెర్త్
రెండవ వన్డే: అక్టోబర్ 23, అడిలైడ్ ఓవల్, అడిలైడ్
మూడవ వన్డే: అక్టోబర్ 25, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ
టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ వివరాలు:
మూడు వన్డేలు భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. టాస్ ఉదయం 8:30 గంటలకు వేస్తారు.
లైవ్ టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ మూడు వన్డేలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది
లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా యాప్, వెబ్‌సైట్ లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.
వన్డే సిరీస్ కు ఇండియా స్క్వాడ్:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ
ఇండియాతో వన్డే సిరీస్ కు ఆస్ట్రేలియా జట్టు:
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లాబుస్చాగ్నే, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్
రెండు, మూడు వన్డేలకు: ఆడమ్ జంపా , అలెక్స్ కారీ , జోష్ ఇంగ్లిస్