IPL 2026 mini-auction: ఇద్దరు స్టార్ ప్లేయర్లను వదులుకుంటున్న ఢిల్లీ.. రూ.25 కోట్లతో ఆసీస్ స్టార్ ఆటగాళ్లపై కన్ను!

IPL 2026 mini-auction: ఇద్దరు స్టార్ ప్లేయర్లను వదులుకుంటున్న ఢిల్లీ.. రూ.25 కోట్లతో ఆసీస్ స్టార్ ఆటగాళ్లపై కన్ను!

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. టోర్నీ ప్రారంభంలో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో గెలిచి దూసుకెళ్లిన ఆ జట్టు ఆ తర్వాత వరుసగా ఓడిపోయి ప్లే ఆఫ్స్ కు చేరుకోవడంలో విఫలమైంది. రానున్న సీజన్ లో అక్షర్ పటేల్ ను కెప్టెన్సీ నుంచితప్పించాలని చూస్తున్న క్యాపిటల్స్ జట్టులో భారీ మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026 ఐపీఎల్ మినీ వేలానికి ముందు జట్టును మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇద్దరు స్టార్ ప్లేయర్లను రిలీజ్ చేసే ఆలోచనలో కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసే ఆటగాళ్లు.. టార్గెట్ చేసే ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..    

2026 ఐపీఎల్ మినీ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ జరగనున్నట్టు సమాచారం. ఇంకా ఆధికారిక డేట్ కన్ఫర్మ్ కాలేదు. ఇప్పటి నుంచే ప్రాంఛైజీలు తమ ప్లేయర్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాలపై ఫోకస్ పెట్టాయి. 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటైన్ పై ఒక ఒక అంచనాకు వచ్చాయి. ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసే ఆటగాళ్లలో టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాహుల్ తో పాటు ఆసీస్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను సైతం ఢిల్లీ రిలీజ్ చేయాలని భావిస్తోందట. 

ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో రాహుల్ ను రూ. 14 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఈ టోర్నీలో రాహుల్ స్థాయికి తగ్గట్టు రాణించలేదని ఢిల్లీ యాజమాన్యం అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ కు ముందు జరిగిన కీలక మ్యాచ్ ల్లో రాహుల్ విఫలం కావడం ఢిల్లీ బాగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. దీనికి తోడు కేఎల్ స్ట్రైక్ రేట్ పై నిరాశగా ఉందట. రాహుల్ తో పాటు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను ఢిల్లీ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025 మెగా ఆక్షన్ లో స్టార్క్ ను ఢిల్లీ రూ. 14 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అయితే స్టార్క్ మాత్రం ఒకటి రెండు మ్యాచ్ ల్లో మినహాయిస్తే పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. 

గ్రీన్, మిచెల్ ఓవెన్ పై కన్ను:  

ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్  కామెరాన్ గ్రీన్ ఐపీఎల్ 2026 మినీ వేలంలో దిల్ క్యాపిటల్స్ దక్కించుకోవాలని భావిస్తోందట. గ్రీన్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగలడు. ఇలాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ జట్టులో ఉంటే ఏ జట్టు అయినా పటిష్టంగా మారుతుంది. ఈ ఆజానుభావుడుపై చాలా ఐపీఎల్ జట్లు కన్నేసినట్టు సమాచారం. గాయంతో 2025 ఐపీఎల్ కు దూరమైనా గ్రీన్ మళ్ళీ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. తన రీ ఎంట్రీలోనే ఈ ఆసీస్ ఆల్ రౌండర్ టాప్ ఫామ్ తో చెలరేగుతున్నాడు. వెస్టిండీస్ పై ఇటీవలే ముగిసిన   ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బ్యాటింగ్ లో గ్రీన్ దంచికొట్టాడు. వరుసగా 51, 56*, 11, 55*, 32 స్కోర్లు చేసి సత్తా చాటాడు. అంతేకాదు ఆదివారం (ఆగస్టు 10) సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. 

ఎవరీ మిచెల్ ఓవెన్..? 

మిచెల్ ఓవెన్‌ 2024-25లో బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. హోబర్ట్ హరికేన్స్ తరపున 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 452 పరుగులు చేశాడు. బిగ్ బాష్ లీగ్ ఫైనల్లో ఓవెన్ కేవలం 42 బంతుల్లో 108 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 11 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. బిగ్ బాష్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. ఈ మెగా ఫైనల్లో 39 బంతుల్లో సెంచరీ చేసి పాకిస్థాన్ సూపర్ లీగ్ లో.. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ తర్వాత జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ లో.. ఇటీవలే ముగిసిన వెస్టిండీస్ టీ20 సిరీస్ లో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడి సూపర్ ఫామ్ లో ఉన్నాడు.