Silver Holdings: పన్ను చట్టాల ప్రకారం ఇంట్లో ఎంత వెండి ఉంచుకోవచ్చు.. పూర్తి వివరాలు..

Silver Holdings: పన్ను చట్టాల ప్రకారం ఇంట్లో ఎంత వెండి ఉంచుకోవచ్చు.. పూర్తి వివరాలు..

గడచిన కొన్ని నెలలుగా భవిష్యత్తులో వెండి దొరకదా అన్నట్లుగా భారతీయులు కొంటున్నారు. పైగా గ్యాప్ లేకుండా పెరుగుతున్న రేట్లు కూడా దీనిని మరింతగా ప్రేరేపిస్తున్నాయి. వారాల్లో అమ్మాల్సిన వెండి వస్తువులు రోజుల్లోనే ఖాళీ అయిపోయినట్లు వ్యాపారులు కూడా చెబుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం ధనత్రయోదశి, దీపావళి వస్తున్న వేళ ఈ విలువైన లోహాలకు మరింతగా డిమాండ్ కనిపిస్తోంది. 

అయితే బంగారం మాదిరిగానే ఒక్కో వ్యక్తి వద్ద ఎంత వరకు వెండి ఉండొచ్చు అనే ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. దేశంలో ఆదాయపు పన్ను చట్టం 1961దీని గురించి ఏమని చెబుతుంది అనే వివరాల గురించి సీఏ సురేష్ సురానా ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం మాదిరిగా వెండిపై ఎలాంటి పరిమితి ఆంక్షలు లేవని అయితే దానిని చట్టబద్ధమైన మార్గాల్లో అందుకుంటే ఏమీ తప్పులేదన్నారు. కేవలం ప్రజలు తమ వద్ద ఉన్న వెండిని అమ్మినప్పుడు వచ్చే క్యాపిటల్ గెయిన్స్ పైన మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుందని సురానా చెప్పారు.

పెద్ద మెుత్తంలో వెండిని కలిగి ఉన్నప్పుడు ప్రజలు తమ వద్ద ఖచ్చితంగా వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు కలిగి ఉండాలని అన్నారు. వెండి కొన్నప్పటి బిల్స్ పన్ను అధికారులకు దర్యాప్తు సమయంలో అందించాలని చెప్పారు. ఇక్కడ వెండి వస్తువులను పక్కన పెడితే.. సిల్వర్ కాయిన్స్, ఆభరణాలను క్యాపిటల్ అసెట్స్ కింద చట్టం పరిగణిస్తుందని చెప్పారు. 

ALSO READ : కొత్త ఇన్వెస్టర్ల దారెటు..?

ఆదాయం కోటి రూపాయలకు పైన ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాలని సీఏ వెల్లడించారు. ఇందులో వారికి ఉన్న బంగారం, వెండి ఆస్తుల వివరాలను కూడా తప్పకుండా అందించాలని పన్ను చట్టాలు చెబుతున్నాయి.