దీపావళికి గోల్డ్ Vs సిల్వర్ Vs క్రిప్టో.. కొత్త ఇన్వెస్టర్ల దారెటు..?

దీపావళికి గోల్డ్ Vs సిల్వర్ Vs క్రిప్టో.. కొత్త ఇన్వెస్టర్ల దారెటు..?

కొంత మంది దీపావళిని కొత్త ప్రయాణానికి చిహ్నంగా భావిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో డబ్బు ఎందులో పెడితే సేఫ్ అనే అనుమానాలు కొత్త ఇన్వెస్టర్లను వెంటాడుతూనే ఉన్నాయి. వారి ముందు కనిపిస్తున్నవి బంగారం, వెండి, క్రిప్టోలే. గోల్డ్ సిల్వర్ అనూహ్యంగా పెరగటం లేదా పడిపోవటం జరుగుతోంది. నిపుణులు మాత్రం బూమ్ తాత్కాలికమేనని అంటున్నారు. దీంతో వీటిలో ఇప్పుడు ఎంట్రీ ఎంత వరకు సేఫ్ అనే అనుమానాలు భారతీయ పెట్టుబడిదారులను వెంటాడుతున్నాయి. 

ప్రస్తుతం క్రిప్టోలు ఒక హైబ్రిడ్ అసెట్ క్లాస్ గా మారింది. వేగంగా 24 గంటలూ ట్రేడింగ్ జరిగే ఇందులో దీర్ఘకాలికంగా ఓపికతో వేచి ఉండే పెట్టుబడిదారులు మంచి లాభాలనే చూశారు. ఈ నెలలో చారిత్రాత్మక గరిష్ఠాలను చూసిన తర్వాత కొంత కరెక్షన్ చూసి లక్షా 10వేల డాలర్ల చేరువలో ట్రేడవుతోంది బిట్ కాయిన్. ప్రధానంగా చైనాపై అమెరికా కొత్త టారిఫ్స్ భయాలు క్రిప్టోల్లో పతనాన్ని ప్రేరేపించిన సంగతి తెలిసిందే. అయితే ఆందోళనలు తగ్గటంతో బిట్ కాయిన్ ఈటీఎఫ్స్ మంచి డిమాండ్ చూస్తున్నాయి మళ్లీ. భారత ప్రభుత్వం ఇటీవల దేశంలో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కింద రిజిస్టర్ కాని ఎక్స్చేంజీలను అడ్డుకోవటం పారదర్శకతను పెంచుతోంది.

ALSO READ : దీపావళి తర్వాత వెండి రేట్లు పడిపోతాయా..?

మెుదటి సారి ఇన్వెస్ట్ చేయాలి క్రిప్టోల్లో అనుకునేవారికి కూడా ఇది మంచి సమయంగానే చెప్పుకోవచ్చు. అయితే క్రమశిక్షణతో పెట్టుబడి అన్నింటికంటే ముఖ్యమైనదిగా నిపుణులు చెబుతున్నారు. ప్రణాళిక ప్రకారం కొనటం మంచిదని ఫోమోకు గురికావద్దని వారు సూచిస్తున్నారు. 2025లో అనూహ్యంగా పెద్ద క్రిప్టోలతో పాటు పెద్దగా ఫేమస్ అవని తక్కువ రేటు క్రిప్టోలకు కూడా భారీగా డిమాండ్ కనిపిస్తోంది. క్రిప్టోలను ప్రస్తుతం చెల్లింపులు, బిజినెస్ సెటిల్మెంట్లకు కూడా వాడటం శుభపరిణామం. అందుకే కొత్త ఇన్వెస్టర్లు పేరున్న స్టేబుల్ కాయిన్స్ పెట్టుబడికి ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

అన్నింటికంటే ముఖ్యమైనది సరైన రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ కింద ఉన్న క్రిప్టో ఎక్స్ఛేంజీ ద్వారా ఇన్వెస్ట్ చేయటం ఈ ప్రయాణానికి మెుదటి మెట్టుగా జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ చెబుతున్నారు. ఈ పండుగకు కొత్త పెట్టుబడి ప్రయాణం మెుదలుపెట్టాలనుకునేవారికి క్రిప్టోలు ఒక సరైన పెట్టుబడి సాధనంగా గమనించదగినది. అయితే ఊహాగానాలు, అనవసరమైన స్పెకులేషన్లను నమ్మకుండా పెట్టుబడిదారులు రీసెర్చ్ చేస్తూ దానిని తమ పెట్టుబడి ఎంపికల్లో ప్రతిబింబించటంతో పాటు దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు చేయటం క్రిప్టోలు ఉత్తమ ఎంపికగా నిరూపిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో ఈక్విటీలు, బంగారం, వెండితో పాటు తమ పోర్ట్ ఫోలియోలో ఇన్వెస్టర్లు క్రిప్టోలకు కూడా కొంత చోటు కల్పించటానికి ఇది సరైన సమయంగా కనిపిస్తోంది.