అక్టోబర్ 18 న రవీంద్రభారతిలో ఆకాశవాణి 90వ వార్షికోత్సవ సంబరాలు

అక్టోబర్ 18 న రవీంద్రభారతిలో ఆకాశవాణి 90వ వార్షికోత్సవ సంబరాలు

ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని  అక్టోబర్ 18 వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి రవీంద్ర భారతి లో "భక్తి లలిత సంగీత విభావరి" కార్యక్రమాన్ని  నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.  ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ  కోమాండూరి రామాచారి బృందంచే ఈ ప్రత్యేక సంగీత కార్యక్రమం "భక్తి లలిత సంగీత విభావరి" ని నిర్వహిస్తున్నట్టు ఆకాశావాణి హైదరాబాద్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్, తెలంగాణ క్లస్టర్ హెడ్ శ్రీ బానోత్  హరిసింగ్, కార్యక్రమ విభాగ అధిపతి శ్రీ రమేష్ సుంకసారి తెలిపారు. 

1936లో స్థాపితమైన ఆకాశవాణి, ప్రసార భారతి ఆధ్వర్యంలో భారతదేశంలోని అతిపెద్ద రేడియో నెట్‌వర్క్‌గా కొనసాగుతోంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం దశాబ్దాలుగా జానపద కళారూపాలను, శాస్త్రీయ  సంగీతాన్ని ప్రోత్సహిస్తూ శ్రోతలకు వినోదాన్ని అందిస్తోంది.