మా హోటల్లో వడ్డిం చే పేద్ద దోస మొత్తం మిగల్చకుండా తినండి.. బిల్లు కట్టాల్సిన పనిలేదు. మేం పెట్టే రుచికరమైన బిర్యానీ మొత్తం లాగిం చండి. ప్రైజ్ కొట్టేయండి. ఇలా హోటళ్ల వారు తరచూ తిండిపోటీలు పెట్టి బిజినెస్ పెం చుకునేందుకు చూస్తుం టారు. అమెరికాలో ఇట్లాంటి తిండిపోటీకి పోయి ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నా డు.కాలిఫోర్ని యాలో మంగళవారం రాత్రి మైనర్ లీగ్బేస్ బాల్ గేమ్ నిర్వహించారు. ఈ సందర్భం గాఫ్రెస్నో గ్రిజిలీస్ అనే సంస్థ టాకో ఈటింగ్ కాం టెస్ట్ పెట్టిం ది. టాకో అనేది మెక్సికో ప్రజలు తయారు చేసే సంప్రదాయ వంటకం. చిన్న చపాతీ లాంటి దాంట్లో వెజ్ లేదా నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టి తయారు చేస్తారు.దీంతో తిండి అంటే బాగా ఇష్టపడే చాలామంది ఉత్సాహంతో ఇక్కడికి క్యూ కట్టారు. డానా హచిం గ్స్ (41)కూడా పోటీకి సై అన్నా డు. పోటీ ప్రారంభమైం ది. కొద్దిసేపటికి హచింగ్స్ తో పాటు మరో ఇద్దరు మాత్రమే బరిలో మిగిలారు. గెలవాలన్న ఆతురతతో హచిం గ్స్ నమలకుం డా మింగుతున్నా డు. ఏడు నిమిషాలు గడిచేసరికి ఒక్కసారిగా ముందుకు తూలిపోయి టేబుల్ పై పడిపోయాడు. వెం టనే అతడ్ని హాస్పిటల్ కు తీసు-కెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
వరల్డ్ టాకో ఈటింగ్ చాంపియన్షిప్ క్యాన్సిల్
అనుకోని ఈ ప్రమాదంతో ఫ్రెస్నో గ్రిజిలీస్ సంస్థ మేనేజ్ మెం ట్ కు షాక్ తగిలింది. దీంతో శనివారం నిర్వహించాల్సి న వరల్డ్ టాకో ఈటింగ్ చాంపియన్ షిప్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిం ది. టాకో ట్రక్ త్రోడౌన్ అనే పోటీ మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. అమెరికాలో ఇలాంటి తిండి పోటీలు చాలానే జరుగుతుంటాయి. ఫ్రెస్నో సంస్థనే 2018లో నిర్వహించిన పోటీలో జాఫ్రీ ఎస్పర్ అనే ప్రొఫెషనల్ ఈటర్ 8 నిమిషాల్లో ఏకంగా 73 టాకోలు తిని విజేతగా నిలిచాడు. న్యూయార్క్ హాట్ డాగ్స్ ఈటింగ్ కాంపిటీషన్లో జో చెష్టంట్ అనే వ్యక్తి 71 హాట్ డాగ్స్ (బర్గర్ లాం టివి) హాం ఫట్ మనిపించి ప్రైజ్ గెలుచుకున్నా డు. ఎస్పర్ ఈ పోటీలో మూడో స్థానంతో సరిపెట్టుకున్నా డు.
