ఎల్లుండి గవర్నర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

ఎల్లుండి గవర్నర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 25న రాజ్-భవన్-లో బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. గవర్నర్ తమిళి-సై ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు పలువురు మహిళా ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మహిళా జర్నలిస్టులు కూడా వేడుకల్లో పాల్గొనాలని గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో  గవర్నర్ కోరారు.  బతుకమ్మ వేడుకలకు అటెంట్ కావాలనుకునే మహిళ జర్నలిస్టులు  76608 30382 నంబర్ ద్వారా తమ పేరు, డిటెయిల్స్ నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.