అంబర్పేట్/హైదరాబాద్ సిటీ/పద్మారావునగర్/ వెలుగు: అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో శనివారం రాత్రి బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆసియా బుక్ఆఫ్రికార్డ్స్, గిన్నిస్బుక్ఆఫ్రికార్డ్స్లక్ష్యంగా 72 అడుగుల భారీ బతుకమ్మను పేర్చారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. గవర్నర్మాట్లాడుతూ.. నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి, సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, దీపక్ రెడ్డి, ఎడెల్లి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంఎంసీ ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. సికింద్రాబాద్మోండా డివిజన్ గ్యాస్ మండిలో గల జీఆర్సీ గ్రౌండ్ లో శనివారం రాత్రి నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు పాల్గొన్నారు.
