చరిత్ర సృష్టించిన లండన్ బతుకమ్మ…

చరిత్ర సృష్టించిన లండన్ బతుకమ్మ…

తెలంగాణ NRI ఫోరమ్ ఆధ్వర్యంలో లండన్ లో బతుకమ్మ, దసరా సంబరాలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. యూరప్ లోనే అతిపెద్ద బతుకమ్మ పండుగను నిర్వహించి చరిత్ర సృష్టించారు. ఇందులో 3000మందికి పైగా బతుకమ్మ ఆటలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్సీ రాం చందర్ రావు పాల్గొన్నారు. అమ్మవారి పూజలతో కార్యక్రమాన్ని మోదలు పెట్టి.. భారత్ నుంచి తెచ్చిన జమ్మి చెట్టుకు పూజను నిర్వహించారు.

భారతీయసంసృతీ సాంప్రదాయాలు బావిపౌరులకు అందజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు, పండుగలు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు ఎమ్మెల్సీ రాం చందర్ రావు. ప్రకృతిని పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంసృతికి నిదర్శనం అని చెప్పారు. కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ NRI ఫోరం ను అభినందించారు.