నేడు (అక్టోబర్​ 14న) ఎంగిలిపూల బతుకమ్మ

నేడు (అక్టోబర్​ 14న) ఎంగిలిపూల  బతుకమ్మ

తెలంగాణ మట్టిబిడ్డల ఇలవేల్పు.. బతుకమ్మ పండుగ రానే వచ్చింది. తీరొక్క పూలతో దినమొక్క తీరుగా తొమ్మిదిరోజులు బతుకమ్మను పేర్చి, ఆడి పాడే ఆడబిడ్డల సంబురాలు శనివారం ‘ఎంగిలిపూల బతుకమ్మ’తో మొదలుకానున్నాయి.  ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ వంటి పాటలతో ఈ నెల 22న సద్దుల బతుకమ్మ దాకా తెలంగాణ పల్లెలు, పట్నాలు ఉయ్యాలలూగనున్నాయి.