మహబూబాబాద్, వెలుగు: ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య నాగలి పట్టారు. శనివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడుతండాలో చాగర్లమూడి భాస్కర్‌కు చెందిన చేనులో పెసర విత్తనాలు వేసే పని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొంత సేపు నాగలి దున్ని, ట్రాక్టర్ నడిపారు. విత్తనాలను చల్లుతూ సందడి చేశారు. ప్రభుత్వం, వ్యవసాయ నిపుణుల సూచనలు పాటిస్తూ, రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలన్నారు. కొత్తపేట, గంధంపల్లి గ్రామాల్లో రూ.30 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గవర్నమెంట్ స్కూల్‌కు స్థలాన్ని విరాళంగా ఇచ్చిన వెంకటేశ్వరరావును సన్మానించారు.
