బావర్చి హోటల్ ఘర్షణ.. బీఆర్ఎస్ నేతలపై కేసు

బావర్చి హోటల్ ఘర్షణ.. బీఆర్ఎస్ నేతలపై కేసు

ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌‌‌‌‌‌‌‌లోని బావర్చి హోటల్‌‌‌‌‌‌‌‌లో గురువారం రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన ఘర్షణపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిరుద్యోగులకు రాహుల్ గాంధీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ అమలు కాలేదంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ బృందం హోటల్‌‌‌‌‌‌‌‌లో ఆయన బొమ్మకు బిర్యానీ తినిపిస్తూ నిరసన తెలిపింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.  

దీనిపై ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు పోలీసులను కలిశారు. హోటల్‌‌‌‌‌‌‌‌లో లైట్లు ఆర్పివేసి క్రిశాంక్ తదితరులు తమపై వస్తువులతో దాడి చేశారని, ఈ క్రమంలో 10 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయని కాంగ్రెస్ నేత వెంకట్ తేజ ఫిర్యాదు చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.