ఎస్టీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి : ఎన్‌‌‌‌‌‌‌‌సీఎస్‌‌‌‌‌‌‌‌టీ సభ్యుడు జాటోత్ హుస్సేన్

ఎస్టీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి : ఎన్‌‌‌‌‌‌‌‌సీఎస్‌‌‌‌‌‌‌‌టీ సభ్యుడు జాటోత్ హుస్సేన్
  • సమీక్ష నిర్వహించిన ఎన్‌‌‌‌‌‌‌‌సీఎస్‌‌‌‌‌‌‌‌టీ సభ్యుడు జాటోత్​ హుస్సేన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీలో పనిచేస్తున్న ఎస్టీ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సర్వీసు సంబంధిత అంశాలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్‌‌‌‌‌‌‌‌సీఎస్‌‌‌‌‌‌‌‌టీ) సభ్యుడు జాటోత్ హుస్సేన్ సమీక్ష నిర్వహించారు. శనివారం జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ హెడ్ ఆఫీసులో కమిషనర్ ఆర్‌‌‌‌‌‌‌‌వీ కర్ణన్, ఎస్టీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ జీతాల చెల్లింపు, కార్మికులకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడం, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ లో పాటు తదితర సమస్యలను వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. 

స్వచ్ఛ ఆటో కార్మికులు తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన కార్మికులకు డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్ ఇళ్లు కేటాయించాలని, కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన భూకబ్జా ఆరోపణల వల్ల కొందరు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సంఘం సమర్పించిన వినతులను పరిశీలించిన ఎన్‌‌‌‌‌‌‌‌సీఎస్‌‌‌‌‌‌‌‌టీ సభ్యుడు ఆయా సమస్యలపై కమిషనర్‌‌‌‌‌‌‌‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.