డ్రగ్స్ వద్దు.. జీవితం ముద్దు’ నినాదాన్ని  ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

డ్రగ్స్ వద్దు.. జీవితం ముద్దు’ నినాదాన్ని  ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  •     నషా ముక్త్ తెలంగాణ, నషా ముక్త్ భారత్ కోసం నిరంతరం కృషి చేయాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  
  •     మూడు రోజుల పాదయాత్రతోనే మన బాధ్యత తీరిపోలేదని స్పష్టీకరణ


హైదరాబాద్, వెలుగు: ‘డ్రగ్స్ వద్దు - జీవితం ముద్దు’ అనే నినాదాన్ని ప్రతి ఇంటికీ చేరవేసి, నషా ముక్త్ తెలంగాణ, నషా ముక్త్ భారత్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మూడు రోజుల పాదయాత్రతోనే మన బాధ్యత తీరిపోలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు రోజులుగా నిర్వహించిన ‘హైదరాబాద్ వాక్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్ర  విజయవంతం కావడంతో ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను, భవిష్యత్ తరాలను కాపాడుకోవాలనే సంకల్పంతో చేపట్టిన ఈ పాదయాత్రకు ప్రజలు, ముఖ్యంగా యువత నుంచి విశేష స్పందన లభించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యువత భవిష్యత్తు కోసం ఈ పాదయాత్రలో అడుగు వేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక బాధ్యతతో ఈ మహోద్యమానికి మద్దతు తెలిపిన సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, సాయికుమార్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, దర్శకులు బోయపాటి శ్రీను, సుకుమార్, శివారెడ్డి, హీరోయిన్ పాయల్ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుత్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.