సిద్ధిపేట జిల్లాలోని బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్

సిద్ధిపేట జిల్లాలోని బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్
  • టిఫిన్ తిన్న విద్యార్థులకు అస్వస్థత

సిద్దిపేట జిల్లా:  జగదేవ్ పూర్ మండలంలోని తిగుల్ గ్రామంలో బాయ్స్ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్ తిన్న తరువాత విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. హాస్టల్ లో ఉదయమే ఒకరి తర్వాత మరొకరు వాంతులు.. విరేచనాలు చేసుకుంటుండడంతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఉన్నతాధికారులతోపాటు.. స్థానిక ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే హాస్టల్ కు వచ్చిన వైద్య సిబ్బంది కొందరికి ప్రాథమిక చికిత్స అందించగా..  మరో నలుగురు విద్యార్థులను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.