- డీజీపీకి బీసీ కమిషన్ చైర్మన్ లేఖ
హైదరాబాద్, వెలుగు: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర ఘటనలో బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలని డీజీపీ శివధర్రెడ్డికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ శనివారం లేఖ రాశారు. చనిపోయిన రెండు నెలల పాప తల్లి మౌనిక బాలింత కావడంతో ఆమెకు విశ్రాంతి అవసరమని తెలిపారు.
ఆ కుటుంబానికి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆ పాపను పూడ్చిన సమాధికి ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత అనేక బీసీ సంఘాల ద్వారా న్యాయం కోరుతూ కమిషన్ కు విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో డీజీపీకి లేఖ రాసినట్లు వెల్లడించారు.
