- బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
దిల్ సుఖ్ నగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యార్థుల స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొత్తపేట చౌరస్తా నుంచి ఎల్బీనగర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రూ.6 వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.37 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. దీంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం నాయకులు జిల్లపల్లి అంజి, నీల వెంకటేశ్, అనంతయ్య, గుజ్జ సత్యం పాల్గొన్నారు.
