ఇక స్టూడెంట్ల అకౌంట్ల కే డైట్, కాస్మెటిక్ చార్జీలు..బదిలీ చేస్తున్న బీసీ గురుకుల సొసైటీ

ఇక స్టూడెంట్ల అకౌంట్ల కే డైట్, కాస్మెటిక్ చార్జీలు..బదిలీ చేస్తున్న బీసీ గురుకుల సొసైటీ
హైదరాబాద్, వెలుగు: సంక్షేమ హాస్టల్స్ లో చదువుతున్న  గురుకుల స్టూడెంట్లకు ప్రభుత్వం చెల్లిస్తున్న డైట్, కాస్మెటిక్  చార్జీలను నేరుగా స్టూడెంట్ల బ్యాంకు  ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. గతంలో వార్డెన్లకు చెల్లించగా వాళ్లు స్టూడెంట్స్ కు ఇచ్చేవాళ్లు. అయితే ప్రభుత్వ సాయం నేరుగా స్టూడెంట్లకే అందాలన్న ఉద్దేశంతో డైరెక్ట్  బెనిఫిట్  ట్రాన్స్ ఫర్  విధానాన్ని ప్రవేశపెట్టారు. 

ఇందులో భాగంగా విద్యార్థులతో బ్యాంకు ఖాతా ఓపెన్  చేసి ప్రభుత్వ సాయాన్ని బదిలీ చేస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఈ నగదు బదిలీ విధానాన్ని అమలు చేస్తున్నారు. బీసీ గురుకుల సొసైటీలో స్కూల్, ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో నేరుగా స్టూడెంట్ ఖాతాల్లో డైట్, కాస్మెటిక్  చార్జీలు వేస్తున్నారు.