ప్రభుత్వానిది విద్యార్థి వ్యతిరేక వైఖరి..జులై 2న రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపు: జాజుల

ప్రభుత్వానిది విద్యార్థి వ్యతిరేక వైఖరి..జులై 2న రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపు: జాజుల

సైఫాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్​మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి వల్లే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని విమర్శించారు. శుక్రవారం సైఫాబాద్​లోని బీసీ భవన్​లో బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వెరిక సురేశ్ ​ఆధ్వర్యంలో.. బీసీ విద్యార్థి యువజన సంఘాల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో 7, 8, 9లతో లక్షలాది మందిని ఆందోళనకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై 2న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, జులై 15న 'చలో హైదరాబాద్'కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగిరాకపోతే సుందరయ్య పార్క్ నుంచి ఇందిరాపార్క్ వరకు భారీ విద్యార్థి మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు