సైఫాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు యావత్బీసీ సమాజం మద్దతు తెలుపుతోందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆర్టీసీ జేఏసీ సమ్మెలో భాగంగా జేఏసీ చైర్మన్ వెంకన్న నేతృత్వంలోని నాయకులు గురువారం జాజుల శ్రీనివాస్ గౌడ్‌ను రవీంద్రభారతిలో కలిసి పోరాటానికి మద్దతు కోరారు.
జాజుల మాట్లాడుతూ.. ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ లీడర్లు గుజ్జ కృష్ణ , కుల్కచర్ల శ్రీనివాస్ , తాటికొండ విక్రమ్ గౌడ్ ,ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

