హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ఎన్నికల కోసం బీసీలంతా ఏకం కావాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు. బీసీ జనాభా ఎక్కువున్న నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులనే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ స్థాయిలో నిర్మాణాత్మక కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు శనివారం కరీంనగర్లో బీసీల శంఖారావం సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బుధవారం ఆయన శంఖారావం సభ పోస్టర్ను ఆవిష్కరించారు. వార్డ్ మెంబర్ నుంచి మున్సిపల్ చైర్మన్దాకా బీసీ రిజర్వేషన్లతో ఎన్నికైన వాళ్లంతా సభకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
