
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. బిసి ఓటర్ల గుర్తింపు పై జోనల్, డిప్యూటీ కమిషనర్లు, రెవిన్యూ, ఐసీడీఎస్ అధికారుల తో జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈనెల 22వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు 15 రోజులపాటు బిసి ఓటర్ల గుర్తింపుకై ఇంటింటి సర్వే చేపట్టాలని కమిషనర్ అన్నారు. జూలై 6న బిసి ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తామన్నారు. జూలై 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు బిసి ఓటర్ల గుర్తింపు పై అభ్యంతరాల స్వీకరణ ఉంటుదన్నారు. జూలై 18న వార్డుల వారీగా బిసి ఓటర్ల తుది జాబితా ప్రకటించి, జూలై 19న ఆ జాబితాను మున్సిపల్ పరిపాలన శాఖ సంచాలకులకు సమర్పిస్తామని దాన కిషోర్ తెలిపారు.