ఓయూ, వెలుగు: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రౌడీషీటర్ నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చారంటూ బీసీలను అవమానించేలా మాట్లాడిన ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద కేసీఆర్ ఫొటోలను చించి నిరసన తెలిపారు. దహనం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ.. బీసీలను నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమన్నారు. బీసీ ఓట్లతోనే పదేళ్లు సీఎం పదవి అనుభవించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి యువజన పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు కూర శ్రీనివాస్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరబోయిన లింగయాదవ్, బీసీ విద్యార్థి సంఘం ఓయూ ఇన్చార్జి గోదా రవీందర్, గుంటి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
